మాలాంటి వారి బతుకులు ఇలాగే ఉంటాయి.. ప్రయాణం చేయాల్సిందే.. అనసూయ కామెంట్స్ వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలకు కమిటీ అవ్వడమే కాకుండా ఏకంగా ఆరేడు సినిమాలకు పైగా కమిట్ అయి ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లో అలాగే బుల్లితెర కార్యక్రమాల షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అనసూయ ఎన్నో పోస్ట్ లు చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఇకపోతే తాజాగా అనసూయ ప్రస్తుతం పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున నాలుగు గంటలకు షూటింగ్ ప్యాకప్ చెప్పారని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ యాక్టర్స్ బతుకులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ప్యాకప్ చెప్పారు 6 గంటలకు ఫ్లైట్ ఉంది. తిరిగి మరొక షూటింగ్ లో పాల్గొనాలి అంటూ ఈమె తెలియజేశారు.

ఫ్లైట్ ఎక్కిన తర్వాత అనసూయ మరొక పోస్ట్ చేస్తూ.. నిద్రరాకపోయినా సరే ప్రయాణాలు చేయాల్సిందే అంటూ ఆమె షూటింగ్ ల కోసం పడుతున్న కష్టాలను ఇలా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఏదిఏమైనా నటిగా అనసూయ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె కమిటైన సినిమాలన్నీ కూడా షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి త్వరలోనే నటించిన సినిమాలన్నీ కూడా వెంటవెంటనే విడుదల అవుతున్నాయని తెలుస్తోంది.