Anchor Anasuya: చిలిపి ఫోజులతో ఫోటోలు షేర్ చేసిన అనసూయ.. హార్ట్ కిల్లర్ అంటూ కామెంట్స్…!

Anchor Anasuya: బుల్లి తెర ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయింది. ఇలా బుల్లితెర మీద యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన అనసూయ నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ పలు టీవీ షోల తోపాటు ఐదారు సినిమాలతో బిజీ గా ఉంది.

అయితే టీవీ షోలతో సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అనసూయ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ప్రతివారం తన హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్స్ కి చెమటలు పట్టిస్తోంది. ఇద్దరి పిల్లల తల్లి లా కాకుండ 16 ఏళ్ళ పడుచు పిల్లల అందాలు ఆరబోస్తూ నిత్యం తన గ్లామర్ తో కుర్రాళ్ల చూపుల్ని తనవైపు నుండి తిప్పకుండా కట్టి పడేస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల అనసూయ చాలా సంప్రదాయబద్దంగా తయారయ్యి భర్త కోసం ఉపవాసం ఉండి మరి పూజ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ
ట్రోల్ చేశారు.

ఇక తాజాగా సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటోలలో చిలిపి పోజులతో నెటిజన్స్ ని కట్టిపడేసింది. వెక్కిరిస్తున్నట్టుగా ఫోటోలకు పోజులు ఇచ్చి కుర్రాళ్లని ఆటపట్టిస్తుంది. అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హాట్ నేస్ లో నిన్ను మించిన వారే లేరు అని కొందరూ కామెంట్ చేయగా.. హార్ట్ కిల్లర్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.