Anchor Anasuya: మేకప్ లేని ఫోటోని షేర్ చేసిన అనసూయ.. పెద్ద స్కామ్ చేశావంటూ కామెంట్స్ వైరల్!

Anchor Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ హవా మామూలుగా ఉండదు. మేల్ యాంకర్స్ కన్నా ఫిమేల్ యాంకర్స్ సంఖ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. టాలీవుడ్ యాంకర్స్ లో అనసూయ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టీవీలో ప్రసారమౌతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అనసూయ క్రేజ్ బాగా పెరిగిపోయింది. అనసూయ తన యాంకరింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

అనసూయ భరద్వాజ్ యాంకర్ మాత్రమే కాదు. అనసూయ నటిగా , యాంకర్ గా , డాన్సర్ గా , న్యాయనిర్ణేతగా కూడా కొన్ని షోస్ ద్వారా అందరిని అలరించి మెప్పించింది . అనసూయ బుల్లితెర మీద ఎన్నో షోస్ కి యాంకర్ గా వ్యవహరించినప్పటికీ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అనసూయ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అనసూయ సినిమాలతో , టీవీ షోస్ తో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు , వీడియోస్ అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

అనసూయ భరద్వాజ్ నటించిన పుష్ప సినిమా తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.. పుష్ప సినిమాలో అనసూయ దాక్షాయని పాత్రలో విలన్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. బుల్లితెరపై అనసూయ గ్లామర్ షో చేస్తూ కుర్రకారును ఆకట్టుకున్నప్పటికీ వెండితెరపై మాత్రం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటున్నారు. తాజాగా అనసూయ సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేయగా అందులో అనసూయ మేకప్ లేకుండా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటో పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆ ఫోటోలలో అందంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం అనసూయ అసలు రూపం బయట పడింది అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరైతే ఇన్ని రోజులు ఇంత పెద్ద స్కామ్ చేశావు అనసూయ అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అయిపోతున్నాయి. మరి ఈ కామెంట్ కు అనసూయ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.