జబర్దస్త్ నుండి అనసూయ ఔట్..? వైరల్ అవుతున్న పోస్ట్..!

బుల్లితెర అందాల యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ తన వైవిధ్యమైన నటనతో వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ఇలా ఇటు బుల్లితెర మీద అటు వెండితెర మీద అనసూయ తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. తాజాగా అనసూయకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం ఆ షోకి స్వస్తి చెప్పనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఎప్పుడు తన గ్లామర్ తో సోషల్ మీడియాలో సందడి చేసే అనసూయ తాజాగా ఒక పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ లో అనసూయ తన జీవితంలో తీసుకున్న ఒక ముఖ్య నిర్ణయం గురించి రాసుకొచ్చింది. ఈ క్రమంలో అనసూయ ఇంస్టాగ్రామ్ లో ” నా కెరీర్‌లో నేను చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చాలా మొమోరీస్‌ని తీసుకెళ్తున్నాను. అందులో ఎన్నో మధురక్షణాలతో పాటు.. కొన్ని చేదు క్షణాలు.. కూడా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను” అంటూ అనసూయ పోస్ట్ చేసింది.అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

దీంతో అనసూయ ఇలా పోస్ట్ షేర్ చేయటంతో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనుంధి అందుకే ఇలా పోస్ట్ షేర్ చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంతకాలం జబర్దస్త్ తో తన యాంకరింగ్ తో పాటు అందాలతో కూడా ఆకట్టుకున్న అనసూయ వెళ్ళిపోవటం వల్ల జబర్దస్త్ రేటింగ్స్ మరింత పడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అనసూయ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్, సూపర్ సింగర్ జూనియర్స్ షో లకి యాంకరింగ్ చేస్తోంది. అంతేకాకుండా వెండితెర మీద వరుస సినిమాలలో నటిస్తూ నిత్యం బిజీగా ఉంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించిన అనసూయ పుష్ప 2 సినిమాలో కూడా కనిపించనుంది.