మాస్ స్టెప్పులతో డాన్స్ ఇరగదీసిన అనసూయ.. వీడియో వైరల్…!

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. బుల్లితెర మీద యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటి గా కూడా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. మొదట న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ తర్వాత ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా బాగా పాపులర్ అయింది. ఇలా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన తర్వాత అనసూయ కి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన అనసూయ సినిమా ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ అప్పటినుండి రంగమ్మత్త గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో విడుదలైన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అనసూయ నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం అనసూయ అరడజను పైగా సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తోంది. ఇలా నటిగా మాత్రమే కాకుండ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ సందడి చేస్తోంది. సాధారణంగా అనసూయ జబర్దస్త్ లో స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తుంది. కానీ తాజాగా ఒక టీవీ షో లో అనసూయ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయింది. ఈమె డాన్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అనసూయ కొంతకాలంగా మా టీవీలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో కి సుధీర్ తో కలసి యాంకర్ గా సందడి చేస్తోంది. ఇటీవల మరొక షో లో కూడా అనసూయ యాంకర్ గా కనిపించబోతోంది. మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో వారు ‘పార్టీ చెద్దాం పుష్ప’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనసూయ ఓ మాస్ పాటకు అదిరిపోయే డాన్స్ చేస్తూ రచ్చ చేసింది. అనసూయ పెర్ఫార్మెన్స్ కి అక్కడున్న వారందరూ చప్పట్లు కొడుతూ… విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.