జబర్దస్త్ నుండి అనసూయ జంప్.. కానీ రష్మి మాత్రం అక్కడే?

ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలియనివారంటూ ఉండరు . మొదట నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మీ అక్కడ సరైన గుర్తింపు లభించలేదు. తర్వాత బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి అనసూయ యాంకరింగ్ చేయగా.. ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి రష్మీ యాంకరింగ్ చేస్తోంది. ఈ షో ద్వారా వీరిద్దరూ తమ గ్లామర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. జబర్దస్త్ అంటే కామెడీ మాత్రమే కాదు గ్లామర్ కూడా అని వీరిద్దరూ నిరూపించారు.

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా జబర్దస్త్ నుండి జడ్జెస్ తో పాటు పలువురు స్టార్ కమెడియన్లు కూడా బయటికి వెళ్లారు. ఇక తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా ఈ షోకి దూరం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జబర్దస్త్ నుండి ఇలా ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే బయటకు వెళ్లడంతో జబర్దస్త్ రేటింగ్స్ చాలా దారుణంగా పడిపోయాయి. ఈ షో కి ప్రేక్షకులలో ఉన్న ఆదరణ బాగా తగ్గింది. అయితే ఇలా ఒకరి తర్వాత ఒకరు జబర్దస్త్ నుండి బయటికి రావటానికి కారణం జబర్దస్త్ యాజమాన్యం వారు రెమ్యూనరేషన్ పెంచకపోవటం అని సమాచారం.

అయితే ఈ షో లో చేస్తున్న కొంతమంది కమెడియన్స్ కి రెమ్యూనరేషన్ తగ్గించటం వల్ల వారు బయటికి వెళ్లారని టాక్. ఇక ఇప్పుడు అనసూయ వెళ్ళటంతో రష్మి సంగతి ఏంటి అని అందరూ అనుమాన పడుతున్నారు. అయితే రష్మి మాత్రం తనకి ఇంత గుర్తింపు తెచ్చిపెట్టిన జబర్దస్త్ షో ని మాత్రం వదిలి వెళ్లనని చెబుతుందట. అంతేకాకుండా రష్మి రెమ్యునరేషన్ తగ్గించినా కూడా జబర్దస్త్ లో ఉండటానికే ఆసక్తి చూపుతోందని సమాచారం. అయితే ఈ షో లో ఒక ఎపిసోడ్ కి రష్మి కి దాదాపు లక్ష కు పైగా రెమ్యూనరేషన్ అందుతున్నట్టు సమాచారం.