అనసూయ మామూలు కమర్షియల్ కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మారుతి?

ఈ రోజుల్లో సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన మారుతి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఈయన దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో, ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న “పక్కా కమర్షియల్” సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో గోపీచంద్, రాశి కన్నా హీరో, హీరోయిన్లు గా నటించారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దం అయ్యింది.

మారుతి దర్శకత్వం వహించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో జోరుగా సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర బృందం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో సందడి చేశారు. జబర్దస్త్ షో లో గోపీచంద్ తో పాటు పాల్గొన్న డైరెక్టర్ మారుతి అనసూయ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జబర్దస్త్ షోలో సందడి చేసిన మారుతి అనసూయ గురించి మాట్లాడుతూ..” పక్కా కమర్షియల్ యాంకర్ ని కలవడానికి నేను జబర్దస్త్ కి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ యాంకర్ మామూలు కమర్షియల్ కాదు. సినిమాలలో చిన్న చిన్న పాత్రలు ఇస్తే అసలు చేయదు” అంటూ జబర్దస్త్ స్టేజ్ మీద అనసూయ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అనసూయ మారుతిని ఆపడానికి ప్రయత్నం చేసింది. అయితే అనసూయ గురించి మారుతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మారుతి చెప్పిన మాటలలో కొంతవరకు నిజం ఉంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.