అనసూయ కాంట్రవర్సీ..అందరి హీరో ఫ్యాన్స్ ని కెలికేసింది.!

టాలీవుడ్ నటి బుల్లితెర గ్లామర్ యాంకర్ అనసూయ పేరు మరోసారి సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇప్పుడు పెద్దగా సినిమాలు టీవీ లలో కూడా కనిపించడం లేదు కానీ కొన్ని ఆఫర్స్ మాత్రం చేతిలో ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోకి రావడమే అరుదు అయితే ఆలా వస్తూనే ఏదో కాంట్రవర్సీని కావాలనే తీసుకొని రావాలని చూసినట్టుగా వచ్చి మాట్లాడ్డం ఇప్పుడు మరోసారో చర్చకు దారి తీసింది.

ఇక మొదటగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేస్తూ దానికి పెద్ద ఎత్తున ట్రోల్స్ అభిమానులు చేయడంతో అంతా రివర్స్ అయ్యింది. అయితే అసలు విజయ్ దేవరకొండ ది అనే ట్యాగ్ పెట్టుకుంటే అనసూయకి వచ్చిన నొప్పి ఏంటి అని అంతా అంటూ ఉంటే దీనిని కాస్త అనసూయ ఇక ఇండస్ట్రీ లో ఉన్న అందరి హీరోస్ కి ఆపాదించేసింది.

హీరోస్ ఇలాంటి వాటిపై భాద్యత తీసుకోవాలి స్టాండ్ తీసుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తుంది. అసలు స్టార్ట్ చేసిందే ఈమెనే అయితే వెళ్లేందుకు స్టాండ్ తీసుకోవాలి అని కొందరు గట్టి కౌంటర్ లు వేస్తున్నారు. ఈ స్టార్స్ అంతా ఎందుకు వీళ్ళని ఆపట్లేదు వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పోతుంది అనా అంటూ ప్రశ్నిస్తుంది. ఇక దీనితో కొందరు ఇంకా గట్టిగా అనసూయ ని ఈ కాంట్రవర్సీ విషయంలో ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అనసూయ పుష్ప 2, విమానం అనే సినిమాల్లో నటిస్తుంది.