Anasuya Bhardwaj: అనసూయ భరద్వాజ్.. అందంతో, అభినయంతో ఒక వైపు బుల్లితెరని, మరోవైపు వెండితెరని సమానంగా ఏలుతుంది. ఎప్పటికప్పుడు కొదవలేని జబర్దస్త్ అందాలని ప్రేక్షకులకి పంచుతూ అలరిస్తూ ఉంటుంది. స్టార్ హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోకుండా సమానంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. అయితే అనసూయ పేరు వివాదాల్లోకి కూడా తరచూ గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప’ బాక్సఫీసు దగ్గర కలెక్షన్స్ తో బెంబోలిస్తుంది. బొమ్మ ఈ థియేటర్లో ఆడినా ‘తగ్గేదేలే’ అంటూ కలెక్షన్లు రాబడుతుంది. భాషా బేధం లేకుండా.. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా దేశంలో ఉన్న సినీ ప్రియులందరికీ పూనకాలు తెప్పిస్తుంది ఈ పుష్ప చిత్రం. ముందు డివైడ్ టాక్ అందుకున్నా.. ఆ తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ చిత్ర యూనిట్ తిరుపతిలో సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సినిమాలో అనసూయ దాక్షయినిగా మెరిసింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో అనసూయ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ పైన కొన్ని హాట్ కామెంట్స్ చేసింది.
ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ముందుగా చెప్తాను. సినిమా ప్రమోషన్స్, ఇంటర్యూలలో ఈయన గురించి చెపుదాం అనుకున్నా. కానీ, తండ్రిని కోల్పోయిన బాధలో ఏ ఇంటర్వ్యూ కి రాలేకపోయాను. కానీ, ఈరోజు చెప్తున్నా.. నా లైఫ్‌లో బన్నీ ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలీదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒక పద్ధతిలో చెప్పాను బన్నీ, కానీ అది ఇంకోలా వెళ్లింది. మీ ఆర్మీ నన్ను బాగా తిట్టేశారు. ఈ విషయం మీదాకా వచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. కానీ మీది చాలా పెద్ద మనసు. అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా మీరు ఇన్‌స్పిరేషన్ అని పుష్ప తిరుపతి సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చింది అనసూయ. ఇదంతా పక్కన పెడితే అందరితోపాటు నాకూ ఉన్న కంప్లైంట్ ఉంది. అది ఏంటంటే? పుష్పలో నన్ను చాలా తక్కువగా చూపించారు. రెండో భాగంలో మాత్రం చక్రం తిప్పుతా’ అని చెప్పుకొచ్చింది అనసూయ భరద్వాజ్.