Anasuya: బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న వారిలో నటి అనసూయ భరద్వాజ్ ఒకరు. ఎంబీఏ పూర్తి చేసుకున్న అనసూయ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో న్యూస్ రిప్రెసెంటేటర్ గా పనిచేశారు. అనంతరం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా అవకాశం అందుకున్న అనసూయ ఈ కార్యక్రమంతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం కావడంతో ఈమెకు తిరుగులేకుండా పోయింది. అంతేకాకుండా క్రమక్రమంగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
ఇక వెండితెరపై అనసూయకు రంగస్థలం సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా తర్వాత అనసూయకు వరుసగా అవకాశాలు రావడంతో బుల్లితెరకు కూడా గుడ్ బై చెప్పేసారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో అవకాశం అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే మే 15వ తేదీ నాటికి అనసూయ నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టారు. ఇటీవల ఈమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి. నిత్యం ఫ్యామిలీతో కలిసి ఏ వేడుకైనా జరుపుకునే అనసూయ ఈసారి మాత్రం చాలా భిన్నంగా తన పుట్టినరోజు వేడుకలను ఒక అనాధ ఆశ్రమంలో జరుపుకున్నారు.
ఇలా అనాధ ఆశ్రమానికి వెళ్ళిన అనసూయ అక్కడే పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడమే కాకుండా పిల్లలతో కలిసి సరదాగా గడుపుతూ ఆటల పాటలతో సందడి చేశారు అలాగే పిల్లలకు కావలసిన వస్తువులను కూడా అందజేశారు. ఇక పిల్లలందరికీ కూడా స్వయంగా భోజనాలు వడ్డించి పిల్లలతో పాటు వీరు కూడా కలిసి తిన్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనసూయలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా ఎప్పుడు బయటపడలేదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.