Anasuya: రెచ్చగొట్టొద్దు దమ్ముంటే స్టేజ్ మీదకి రా… ఆకతాయికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ?

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు న్యూస్ రీడర్గా తన ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అనసూయ బుల్లితెర యాంకర్ గా కొనసాగుతూ వచ్చారు. అయితే జబర్దస్త్ కార్యక్రమం ఈమెకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.

ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే ఈమెకు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశం వచ్చింది. అయితే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అవకాశం వచ్చింది. ఈ పాత్ర ద్వారా అనసూయ ఒకసారిగా ఫేమస్ అవడంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ కేవలం వెండితెరపై మాత్రమే సినిమాలు చేస్తూ ఉన్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే కొన్ని సందర్భాలలో ఈమె చేసే పోస్టులు వివాదానికి కూడా కారణం అవుతూ ఉంటాయి. గతంలో ఆంటీ అనే వివాదంలో అనసూయ నిలిచిన సంగతి తెలిసిందే కొంతమంది ఆకతాయిలు ఈమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడంతో ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించి కేసు నమోదు చేయించారు.

తాజాగా ఓ వ్యక్తి తనని ఆంటీ అని పిలవడంతో స్టేజ్ పైనుంచి అనసూయ ఆకతాయికి తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాదులో జరిగిన ఒక ఈవెంట్ కు అనసూయ హాజరయ్యారు అయితే అనసూయని చూసిన ఒక వ్యక్తి ఆంటీ అని పిలవడంతో ఆ పిలుపు కాస్త అనసూయ చెవిన పడింది. దీంతో అనసూయ రెచ్చిపోయారు.

దమ్ముంటే అదే మాట స్టేజ్ మీదకు వచ్చి చెప్పండి నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దు. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో తెలుసు కదా ఏంటి, భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అంటూ సైగ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఘటన పై నెటిజన్స్ భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.