అనసూయకు ఆఫర్ల మీద ఆఫర్లు

Anasuya Bags Crazy Offers
బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఆ సినిమా తర్వాత ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చినా ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది.  ప్రత్యేక గీతాలకు కూడ సైన్ చేస్తోంది. ఇటీవలే ఆమె ‘చావు కబురు చల్లగా’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ‘థాంక్యూ బ్రదర్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది.  కాగా కొన్నిరోజులుగా ఆమె అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’లో స్పెషల్ రోల్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. 
 
ఈ వార్తలు వాస్తవాలేనని తేలింది.  అనసూయ ‘పుష్ప’లో ఒక కీ రోల్ చేస్తోంది.  నిన్ననే ఆమె షూట్లో జాయిన్ అయింది. ‘రంగస్థలం’ సినిమాలో ఆమె చేసిన రంగమ్మ పాత్రలాగానే ఉంటుందని, ఆ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చే సుకుమార్ ఆమెకు ఈసారి కూడ ఛాన్స్ ఇచ్చారట. అనసూయ సైతం ఈ చిత్రం మీద మంచి హోప్స్ పెట్టుకుని ఉంది. మరోసారి ‘రంగస్థలం’ లాంటి హిట్ అందుకోవచ్చని ఆశపడుతోంది.  ఈ చిత్రమే కాకుండా అనసూయ కృష్ణవంశీ చేస్తున్న ‘రంగమార్తాండ’, రవితేజ ‘ఖిలాడి’ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు చేస్తోంది.  చూస్తుంటే అనసూయ రానున్న రోజుల్లో మంచి బిజీ స్టార్ అయ్యేలా ఉంది.  

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles