Anasuya: ఈ క్షణాలు మాకెంతో ప్రత్యేకం…కొడుకు ఉపనయన వేడుక నిర్వహించిన అనసూయ!

Anasuya: బుల్లితెర యాకంర్ అనసూయ ఇంట మరో శుభకార్యం జరిగింది. ఇటీవల అనసూయ కొత్త ఇల్లు కొనుగోలు చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా తన భర్త పిల్లలతో కలిసి ఈమె కొత్తింట్లోకి అడుగు పెట్టారు. అయితే తాజాగా అనసూయ ఇంట్లో మరొక శుభకార్యాన్ని నిర్వహించారు. అనసూయకు ఇద్దరు కుమారులు అనే విషయం మనకు తెలిసిందే. తన పెద్ద కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు శాస్త్రోక్తంగా ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు.

హైదరాబాద్‌లోని తమ నూతన గృహంలో ఈ వేడుకను అనసూయ కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు. ఈ ఉపనయన వేడుకకు సంబంధించిన ఓ అందమైన వీడియోను ఈమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో భాగంగా అనసూయ దంపతులతో పాటు తన పిల్లలు కూడా చాలా సాంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇలా ఈ వీడియోని షేర్ చేసిన అనసూయ ఈ క్షణాలు మాకు ఎంతో ప్రత్యేకము అంటూ అభిమానులతో తమ ఆనంద క్షణాలను పంచుకున్నారు.ఈ ఆధునిక కాలంలో కూడా తమ ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను గౌరవించి, ఉపనయనానికి సిద్ధపడిన కుమారుడిని చూసి గర్వంగా ఉందని తెలిపారు. ఇక ఈ వీడియో చూసినా అభిమానులు అనసూయ దంపతులకు తన కుమారుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక అనసూయ బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.