Anand Mahindra: కొత్త గాయకుడిని పరిచయం చేసిన ఆనంద్ మహీంద్ర.. ట్వీట్ వైరల్

Anand Mahindra: వ్యాపార‌వేత్త‌గా ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో క్ర‌మం త‌ప్ప‌కుండా వీడియోలు పోస్ట్ చేసే వారిలో ఆనంద్ మ‌హీంద్రా ఒక‌రు. ప్రముఖ వ్యాపారవేత్త అయినా సరే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఆయ‌న పోస్ట్ చేసే వీడియోలు కూడా త‌ప్ప‌కుండా వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా ఇవాళ ఓ గాయకుడి వీడియోను పోస్ట్ చేశారు.

అస్సాంలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మెకానిక్ పనిచేస్తూ వాహనాలకు రిపేరీ చేస్తుంటాడు. కాగా, అతడిలో మరో టాలెంట్ కూడా ఉంది. అతడు అద్భుతమైన సింగర్. మెకానిక్ పని చేస్తూనే పాటలు పాడుతుంటాడు. ఆ మెకానిక్ పాడిన ఓ పాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ వీడియోని ఆనంద్ మహీంద్ర సైతం షేర్ చేశారు. ఆ మెకానిక్ టాలెంట్ కు ఆయన ఫిదా అయిన ఆనంద్ మహింద్ర.. ఎంతో అద్భుతంగా పాడుతున్నావ్ అని కితాబిచ్చారు.

“వాహనాలను బాగు చేయడానికి ఇతనికి తన గ్యారేజ్ ఉపయోగపడి ఉండొచ్చు. కానీ, అతడి టాలెంట్.. గ్యారేజ్ కు ఆత్మగా మారింది” అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.