Anaganaga Oka Raju: తెలుగు సినీ ప్రేక్షకులకు హాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ టైంలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. నటించినది తక్కువ సినిమాలే భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చివరగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్ తో కొంచెం గ్యాప్ తీసుకున్నాడు.
అయితే ఇప్పుడు గ్యాప్ తర్వాత నవీన్ పొలిశెట్టి హీరోగా అనగనగా ఒకరాజు సినిమా అనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా సంక్రాతికి పక్కా వస్తుంది అంటూ డేట్ తో సహా అనౌన్స్ చేస్తూ స్పెషల్ ప్రోమోని విడుదల చేసారు మూవీ మేకర్స్. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది.

అయితే తాజాగా ఈ అనగనగా ఒక రాజు సినిమా నుంచి రిలీజ్ చేసిన సంక్రాంతి స్పెషల్ ప్రోమోని ఒక జ్యువెల్లరీ యాడ్ లా సరదాగా షూట్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. కాగా ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమో ని చూసిన అభిమానులు సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నవీన్ నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. మరి అనగనగా రాజు సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి మరి.
