బిగ్ బ్రేకింగ్: ఆంధ్రాకు అమిత్ షా.. అతని సంగతేమిటో తేల్చడానికేనా ? 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రాలో బీజేపీ కార్యకలాపాలు సాగిస్తోంది.  జగన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడ బీజేపీ ఈ స్థాయిలో యాక్టివ్ స్టేట్లో లేదనే అనాలి.  కేంద్ర నాయకత్వం చొరవ తీసుకుని ఏపీ శాఖకు అండదండలు అందించినా చంద్రబాబు అడుగడుగునా అడ్డుతగలడంతో బీజేపీ పెద్దగా ఏమీ చేయలేకపోయింది.  కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది.  ప్రతిపక్షం స్థానాన్ని భర్తీ చేయాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తూ సరికొత్త మార్గాలను నిర్మించుకుంటోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద జరిగిన వరుస దాడుల వివాదాన్ని గట్టిగా వాడుకోవాలని భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయింది.  అందుకే ఛలో అంతర్వేది, ఛలో అమలాపురం లాంటి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

అయితే వీటితో సరిపెడితే అది రాజకీయం ఎందుకవుతుంది.  అందుకే వ్యవహారాన్ని పెద్దది చేయాలని ఏపీలో ఘొరాలు, దారుణాలు జరిగిపోతున్నాయని ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు ఏపీ కమలనాథులు.  అంతేకాదు నిరసన తెలిపడానికి సిద్దమైన తమను ఎక్కడికక్కడ గృహ నిర్భందం చేసి, అరెస్టులు చేశారని పెద్దలకు పిర్యాధులు పంపారు.  ఆంధ్రాలో దేవాలయాల మీద జరుగుతున్న వరుస దాడులు ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నాయని, చర్యలు తీసుకోవలసిన జగన్ సర్కార్ తీవ్ర అలసత్వం చూపుతోందని ఢిల్లీ పెద్దలకు కంప్లైంట్ చేశారు.  

 

Andhra CM Jagan Mohan Reddy meets Union Home Minister Amit Shah - India  Ahead News
అంతేనా… అంతర్వేదిలో చర్చి మీద రాళ్లదాడి జరిగితే అప్పటికప్పుడు స్పందించి పదుల సంఖ్యలో వ్యక్తుల మీద కేసులు పెట్టారని అలాంటి స్పీడ్ రియాక్షన్ హిందూ దేవాలయాల విషయంలో చూపట్లేదని జీవీఎల్ నరసింహరావు, సీఎం రమేష లాంటి నేతలు కేంద్ర హోంశాఖకు పిర్యాధు చేశారు.  అసలే హిందూత్వ ఎజెండా మీద రాజకీయం నడిపే బీజేపీకి ఇంతకంటే మంచి అవకాశం దొరకదనే అనాలి.  ఇలాంటి ఛాన్స్ ఏ రాష్ట్రంలో దొరికినా వెంటనే అక్కడ పర్యటనలు, రకరకాల కార్యక్రమాలతో బీజేపీ పెద్దలు హడావుడి చేస్తుంటారు.  కాబట్టి ఏపీకి కూడ అమిత్ షా వచ్చే అవకాశాలు లేకపోలేదు.  బీజేపీ శ్రేణులు సైతం అమిత్ షా అధికారిక హోదాలో రాష్ట్రానికి వచ్చి పర్యటిస్తే పార్టీలి మంచి మైలేజ్ ఉంటుందని ఆశపడుతున్నారు.  వారు అనుకున్నట్టే అమిత్ షా ఏపీ పర్యటనకు వస్తే మాత్రం జగన్ సర్కారు మీద చురకలు వేయడం ఖాయం.