కేరళలో దారుణం చోటు చేసుకున్నది. కరోనా సోకిన 19 ఏళ్ల యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కేరళలోని పతనంతిట్టా జిల్లాలో చోటు చేసుకున్నది.
19 ఏళ్ల యువతికి కరోనా సోకింది. దీంతో ఆ యువతితో పాటు మరో మహిళను 108 అంబులెన్స్ లో వేర్వేరు ఆసుపత్రులకు తరలిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకున్నది.
25 ఏళ్ల నౌఫల్ అనే అంబులెన్స్ డ్రైవర్ ముందుగా.. మహిళను ఓ ఆసుపత్రిలో దించి.. ఆ తర్వాత 19 ఏళ్ల కరోనా పేషెంట్ ను వేరే ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకెళ్తున్నాడు. నిజానికి ఆ యువతిని అతడు కోవిడ్ 19 సెంటర్ కు తీసుకెళ్లాలి. కానీ.. అంబులెన్స్ ను దారి మళ్లించి.. అరన్ముల ఎయిర్ పోర్ట్ కు సమీపంలో తీసుకెళ్లి ఆ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన అనంతరం యువతిని తీసుకెళ్లి కోవిడ్ కేర్ సెంటర్ లో చేర్చి అక్కడి నుంచి పరారయ్యాడు.
శనివారం నాడు ఆ యువతికి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే తనను ఆసుపత్రికి తీసుకెళ్లడం కోసం అంబులెన్స్ కు కాల్ చేశారు.
కోవిడ్ కేర్ సెంటర్ కు చేరిన తర్వాత ఆ యువతి తనకు జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేయడంతో అంబులెన్స్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.