Ambati Gets Minister : పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తారట.! మంత్రి పదవి అందుకేనేమో.!

Ambati Gets Minister : ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎందుకిలా తగలబడింది.? పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదుగానీ, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుగారికి పవన్ కళ్యాణ్ మీద సినిమా తీయడమెలాగో తెలుసట.! ఇది చాలదా.? వైఎస్ జగన్ సర్కారు, అధికారంలోకి ఎందుకు వచ్చింది.? ఏం చేస్తున్నదీ అర్థం చేసుకోవడానికి.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు. కానీ, వెటకారపు సినిమాలు.. పైగా రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం సినిమాలు తీసే స్థాయికి మంత్రులు దిగజారిపోతే ఎలా.? పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తామని మంత్రి అంబటి రాంబాబు ప్రకటించగానే అంతా ముక్కున వేలేసుకున్నారు.

‘నా మీద సెటైర్లేస్తున్నారు.. నేను సినిమాలకు స్క్రిప్ట్ రాసినోడ్ని.. మీకంటే బాగా సెటైర్లు పేల్చగలను..’ అని పవన్ కళ్యాణ్ వైసీపీని హెచ్చరిస్తే, దానికి కౌంటర్ ఎటాక్ రూపంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజానీకానికి మైండ్ బ్లాంక్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ ఓ పార్టీ అధినేత.. పైగా, ఆయన ఏ చట్ట సభకీ ప్రాతినిథ్యం వహించడంలేదు. అంబటి రాంబాబు అలా కాదు కదా.? ఆయన ఎమ్మెల్యే, పైగా మంత్రి. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి వైసీపీలో చాలామంది నాయకులు వుండొచ్చు. కానీ, అంబటి ఎందుకు సినిమా తీస్తానంటూ హంగామా చేయడం.?

ఏం, జనసేన పార్టీ మద్దతుదారులు అంబటి రాంబాబు మీద సినిమా తీయలేరా.? పవన్ మీద సినిమా తీస్తారట.. కానీ, హీరోయిన్లు దొరకడం కష్టమట.. ఎందుకంటే హీరోయిన్లు ఎక్కువమంది అవసరమవుతారట.. ఇదీ అంబటి సెటైర్. ఈ స్థాయికి మంత్రి అయ్యాక అంబటి రాంబాబు స్థాయి దిగజారిపోయింది.

అంబటి స్థాయి సంగతి తర్వాత.. ముందైతే వైసీపీ స్థాయి రోజురోజుకీ దిగజారిపోతోంది.. ఇలాంటి మంత్రుల వల్ల.
పవన్ కళ్యాణ్ మీద సినిమా కాదు, ముందైతే రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు అవసరం.. ఆ పనేదో చూడండి మంత్రి అంబటి రాంబాబుగారూ.!