Home News 'సలార్' కోసం ఇప్పటి నుంచే ఎగబడుతున్నారు !

‘సలార్’ కోసం ఇప్పటి నుంచే ఎగబడుతున్నారు !

Amazon Prime Quoting Big Amount For Salaar
ప్రభాస్.. ఇండియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న హీరో.  ప్రశాంత్ నీల్.. ‘కెజిఎఫ్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్.  ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఆ క్రేజ్ లెవల్ విపరీతంగా ఉంటుంది.  వ్యాపార వర్గాల్లో హాట్ కేకే తరహాలో అమ్ముడైపోతుంది.  ప్రజెంట్ ‘సలార్’ విషయంలో ఇదే జరుగుతోంది.  ఇదొక గ్యాంగ్ స్టర్ చిత్రం. భారీ వ్యయంతో నిర్మితమవుతోంది.  ప్రభాస్, ప్రశాంత్ నీల్ భవిష్యత్తులో చేయబోయే భారీ ప్రాజెక్టుకు ఇది శాంపిల్ వెర్షన్. దీన్నే విపరీత స్థాయిలో రూపొందిస్తున్నారు.  ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ ఇది రిలీజ్ కానుంది. 
 
అన్ని పరిశ్రమల్లోనూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా హక్కుల కోసం ఎగబడుతున్నారు.  ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కొందరు బ్లాక్ చేసుకోగా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం పోటీ నెలకొంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ హెవీ అమౌంట్ ఇచ్చి హక్కుల్ని కొనడానికి సిద్ధంగా ఉందట.  ఈ ధర ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు దక్కనంత రికార్డ్ ధర అని తెలుస్తోంది. అమెజాన్ మాత్రమే కాదు ఇతర బడా సంస్థలు సైతం సినిమా హక్కుల కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నాయి.  మొత్తానికి సినిమా ఇంకా సగం కూడ పూర్తికాకముందే అలజడి సృష్టిస్తోంది.  
 

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News