నాగచైతన్యను నేను పెంచలేదు.. చైతూ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అమల?

అక్కినేని నాగార్జున భార్యగా, నటిగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే. నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం నాగార్జున రెండవ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి అఖిల్ జన్మించారనే విషయం మనకు తెలిసిందే. ఇక నాగచైతన్య నాగార్జున దగ్గుబాటి లక్ష్మి దంపతుల కుమారుడు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఎప్పుడూ కూడా నాగచైతన్య గురించి అమల ఏ సందర్భంలోనూ మాట్లాడలేదు.

తాజాగా అమల నాగచైతన్య గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ తాను నాగ చైతన్యను ఎప్పుడు పెంచలేదని తను ఎప్పుడు తన తల్లి లక్ష్మీ దగ్గర ఉండేవారని తన దగ్గరే చెన్నైలో పెరిగాడని అమల నాగచైతన్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య తన తల్లి లక్ష్మి ఎంతో పద్ధతిగా పెంచారు. నాగచైతన్య సెలవలకు, ప్రతి రెండు నెలలకు ఒకసారి హైదరాబాద్ వచ్చేవారు.

ఈ విధంగా హైదరాబాద్ వచ్చిన నాగచైతన్య ఎక్కువగా తన తండ్రితో సమయం గడిపేవాడు. నాగ చైతన్య ఇంటికి వస్తే అఖిల్ కు అమ్మ అవసరం ఏమాత్రం ఉండేది కాదు. ఎప్పుడు చూడు అన్నా అన్నా అంటూ చైతన్య దగ్గరకు వెళ్లే వాడని వాళ్ళిద్దరు ఎంతో బాగా ఆడుకొనే వారని అమల చైతన్య గురించి వెల్లడించారు. ఇక అఖిల్ ఎంతో యాక్టివ్ గా ఉంటూ అల్లరి చేస్తుండగా… చైతన్య మాత్రం చాలా సైలెంట్ గా ఉండేవాడు అంటూ అమల వీరి గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.