NTR 30 Movie: వాయిదా మీద వాయిదా పడుతున్న ఎన్టీర్ 30.. అసలు కారణం ఏమిటి..?

NTR 30 Movie : రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమ విడుదలైన తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్‌సి 15’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా మొదలయ్యాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 30% ఈ సినిమా షూటింగ్ పూర్తీ అయ్యింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తె ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీర్ కొరటాల శివ దర్శకత్వంలో “ఎన్టీర్ 30 ” అనే సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. జూన్ లో మొదలు కావలసిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ పట్టలెక్కలేదు. ప్రతిసారీ ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో తమ అభిమాన హీరోని సోలోగా థియాటర్లలో చూడలకున్న ఎన్టీర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఇదిలాఉండగా ఈ సినీమా మేకర్స్ సినిమాకీ సంబంధించిన మోషన్ పోస్టర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఇన్నిసార్లు వాయిదా పడటనికి కారణమెంటని ఎన్టీఆర్ అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథ ఇంకా తయారు అవ్వక పోవడం వల్లే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభంకానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్టీఆర్ 30 సినిమా 2023 ఆఖరులో ప్రేక్షకుల ముందుకి రానుంది.