మూవీ రివ్యూ : అల్లూరి

దర్శకుడు : ప్రదీప్ వర్మ

నటీనటులు: శ్రీ విష్ణు, కాయదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్ (30 సంవత్సరాలు), రవివర్మ, మధుసూధన్ రావు రెడ్డి, జయ వాణి
నిర్మాతలు బెక్కెం వేణు గోపాల్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పర్చుకున్న శ్రీ విష్ణు ‘రాజా రాజా చోర’, ‘భళా తందనాన’ సినిమాల తర్వాత మొదటిసారి పోలీస్ గా ‘అల్లూరి’ సినిమాతో వచ్చాడు. టాలెంట్ ఉన్న కానీ, వాయిస్ శ్రీ విష్ణు కి పెద్ద మైనస్. ఈ సినిమాలో ఆ మైనస్ ని ప్లస్ గా మార్చుకున్నాడా లేదా చూద్దాం. అల్లు అర్జున్ ఈ సినిమా కి గెస్ట్ గా రావడం వల్ల ఈ సినిమా కి మంచి హైప్ వచ్చింది, అయితే హైప్ కి తగ్గట్టు ఈ మూవీ ఉందా లేదా చూద్దాం.

కథ:

20 సంవత్సరాల కాలంలో లెక్కలేనన్ని ట్రాన్స్ఫర్ లు  ఎదుర్కొన్న ఒక  సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఎ. రామరాజు (శ్రీవిష్ణు) ప్రయాణాన్ని అల్లూరి సినిమా  వివరిస్తుంది, తన పోలీస్ కెరీర్ లో ఒక సమయంలో పవర్ఫుల్,  క్రూరమైన రాజకీయ నాయకుడిని ఎదుర్కొన్నప్పుడు తన  జీవితం ఎలా తలకిందులవుతుంది, ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే:

పోలీస్ జానర్‌లలో సినిమాలు ఎప్పుడూ ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. కానీ వాటిని సరిగ్గా హేండిల్ చేయగలగాలి. ‘కర్తవ్యం’, ‘పోలీస్ స్టోరీ’, ‘టెంపర్, ‘పటాస్’, ‘రౌడీ ఫెలో’ లాంటి సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి.  అల్లూరి ప్రమోషన్స్ సందర్భంగా, శ్రీవిష్ణు మాట్లాడుతూ, ఇది పోలీస్ బయోపిక్ అని, చిత్రం ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టదు అని చెప్పాడు. కానీ, ఈ సినిమా చూస్తునంత సేపు కొన్ని సీన్స్  తప్ప మూవీ లో చూడ్డానికి ఒక్క సీన్  కూడా ఇంటరెస్టింగ్ గా అనిపించవు.

ప్లస్ పాయింట్లు:

కొన్ని యాక్షన్ బ్లాక్‌లు
శ్రీవిష్ణు ప్రదర్శన

మైనస్ పాయింట్లు:

బోరింగ్ స్క్రీన్ ప్లే
రొటీన్ సీన్స్

ఓవరాల్ గా శ్రీ విష్ణు మరోసారి తన నటనతో మెప్పించిన కానీ, ఈ సినిమా మాత్రం అలరించదు. శ్రీ విష్ణు కెరీర్ లో ఒక మరిచిపోయే సినిమా.