నేను కూడా తగ్గేదే…లే అంటున్న అల్లు అర్జున్ వైఫ్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ ‘అల్లు స్నేహ’ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సినవసరం లేదు. ఎలా… ఇంత ఫేమస్ పర్సన్ అయ్యారని అడిగితే సోష‌ల్ మీడియా మహిమ అని చెప్పుకోవచ్చు. హీరోల భార్యలకు కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. అందులోనూ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని అందంతో ఉండే అల్లు స్నేహ ఈ జాబితాలో అందరికన్నా టాప్ ప్లేస్ లో ఉంది. తాజాగా ఆమె సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో చాలా మంది హీరోయిన్స్ సైతం అందుకోలేనటువంటి ఫీట్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.

Allu Sneha Reddy Has Garnered Over 4 Million Followers On Instagram

ఆమె 4 మిలియ‌న్‌ ప్లస్‌ ఫాలోయర్స్‌తో టాలీవుడ్‌లో ఏ స్టార్ వైఫ్‌కి లైనన్నీ ఫాలోయర్స్‌ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదించుకున్నారు. భర్త, తన పిల్లలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ బన్నీ అభిమానులను అలరిస్తుంటారు. అందుకే ఆమెకు సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం బన్నీ , డైరెక్టర్ సుకుమార్ తో కలిసి చేస్తున్న పుష్ప మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టే ఆలోచనలో ఉంటే మరో పక్కన ఆయన భార్య కూడా ఇలా రికార్డ్స్ కొడుతోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles