అల్లు శిరీష్.. ఓన్లీ ముద్దులు, హగ్గులు

Allu Sirish next movie posters grabs attention
Allu Sirish next movie posters grabs attention
అల్లు శిరీష్ అప్పుడెప్పుడో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో హిట్ అందుకుని ఇప్పటివరకు మరొక విజయాన్ని చూడలేదు.  ఆయన ఏ ప్రయత్నం చేసినా విఫలవుతూనే ఉన్నాయి. దీంతో శిరీష్ ఈసారి బాగా ఆలోచించి రొమాంటిక్ ఎంటర్టైనర్ చూజ్ చేసుకున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటే అచ్చంగా రొమాంటిక్ ఎంటర్టైనరే. రాకేష్ శశి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా గురించి పెద్దగా విశేషాలేవీ రివీల్ చేయలేదు కానీ రెండు పోస్టర్లు మాత్రం రిలీజ్ చేశారు.  పోస్టర్లు రెండూ వేడి వేడిగా ఉన్నాయి.  
 
మొదటి పోస్టర్లో హీరో హీరోయిన్ల లిప్ లాక్ ఉంటే సెకండ్ పోస్టర్లో ఘాటైన పడక హగ్ దర్శనమిచ్చింది.  యూత్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కోసం హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు. అనుకు మాస్, క్లాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. పెర్ఫార్మన్స్ ఎలా ఉన్నా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అదిరిపోతుంది.  ఆమే ఈ సినిమాకి బిగ్గెస్స్ అస్సెట్ అనాలి.  ఆమె మీదనే ప్రేక్షుకుల గురి.  రేపు సినిమా ప్రీలుక్ విడుదల కానుంది.  శాంపిల్ పోస్టర్లతోనే వేడెక్కించిన టీమ్ ప్రీలుక్ పోస్టర్లో ఎంత హంగామా చేస్తారో మరి.