Allu Ayaan: తండ్రికి ఆల్ ది బెస్ట్ చెప్పిన తనయుడు.. మురిసిపోయిన ఐకాన్ స్టార్!

Allu Ayaan: అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయి చిత్రంలో తెరకెక్కిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్రమంలోని ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు పుష్ప చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా పుష్ప సినిమాకు అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కూడా తనదైన శైలిలో ఆల్దిబెస్ట్ తెలిపారు.

ఈ సినిమా విడుదల కావడంతో అయాన్ తన తండ్రికి పుష్ప రిలీజ్ 17-12-2021 ఆల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ తన తండ్రికి విషెస్ చెప్పారు.ఈ క్రమంలోనే ఈ పోస్టును అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఎంతో మురిసి పోయారు. ఈ పోస్ట్ పై స్పందించిన అల్లు అర్జున్ థాంక్యూ సో మచ్ నా చిన్ని బాబు, ఐ లవ్ మై అయాన్ అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.ఇలా పలువురు సెలబ్రిటీలతో పాటు తన కొడుకు కూడా సినిమాకు శుభాకాంక్షలు చెప్పడంతో అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే డిసెంబర్ 17వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించినటువంటి సునీల్,అనసూయ పాత్రలు సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేసినప్పటికీ థియేటర్లో మాత్రం వీరి పాత్రలను సమర్ధవంతంగా చూపించడంలో లెక్కల మాస్టర్ లెక్క తప్పిందనే చెప్పాలి.