Allu Arjun: తాజాగా సినీ నటుడు హీరో అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు సైతం షాక్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతో పాటు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పట్ల బండికి కాస్త ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కి ఊరటనిచ్చింది. తెలంగాణ న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ బన్నీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై సుదీర్ఘ వాదనలు జరగగా, చివరికి న్యాయస్థానం బన్నీకి ఈ మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది. అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్టు చేశారు అన్న విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలోనే సంధ్యా థియేటర్లకు ఒక ఫ్యామిలీ వచ్చారు. సినిమా విడుదలైన మొదటి రోజు కావడంతో సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఈ క్రమంలో శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా పోలీసులు పేర్కొన్నారు.
మధ్యాహ్నాం 1.30 కి అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను హాజరు పరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోపక్క హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసం కాదని, సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. అల్లు అర్జున్ అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలని అన్నారు. క్వాష్ పిటిషన్ లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగానే అరెస్టు చేశాని, అందువల్ల ఈ పిటిషన్ ద్వారానే మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అర్ణబ్ గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మధ్యంతర అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది.