Allu Arjun: ఐకాన్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారని ఈ సినిమా తర్వాత ఆయనకు కావలసినంత విశ్రాంతి కూడా తీసుకున్నారని తెలుస్తుంది. ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన ఈయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వచ్చిన బన్నీ తన తదుపరి సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటూ అధికారకంగా ప్రకటన విడుదల చేశారు.
ఈ క్రమంలోనే మరో డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది అంటూ ఇటీవల నిర్మాత నాగ వంశీ కూడా ఓ సందర్భంలో వెల్లడించారు. దీంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. శరవేగంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా పనులు ప్రారంభమవుతాయని వచ్చే ఏడాదికి ఈ సినిమా విడుదల అవుతుంది అంటూ అభిమానులు ఎదురు చూశారు . కానీ ఈ సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సైతం ఈ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాసుని కాస్త రిక్వెస్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాని మరొక ఆరు నెలల పాటు ఆలస్యంగా మొదలు పెట్టాలని అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను రిక్వెస్ట్ చేసుకున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం వెంటనే ఒక సినిమాని స్టార్ట్ చేసి 2026 నాటికి దానిని విడుదల చేయాలని భావిస్తున్నారట అందుకే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని కాస్త వాయిదా వేయమని కోరాడట.
తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభమై కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత తిరిగి త్రివిక్రమ్ షూటింగ్ పనులలో పాల్గొంటానని బన్నీ చెప్పడంతో అందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రేక్షకులు అందరూ కూడా పుష్ప 2 సక్సెస్ లోనే ఉన్నారు వెంటనే గ్యాప్ ఇవ్వకుండా మరో సినిమా వస్తే అద్భుతంగా ఉంటుందనే ఆలోచనలో బన్నీ ఉండటం వల్లే త్రివిక్రమ్ కు రిక్వెస్ట్ చేసుకున్నారని సమాచారం.