Allu Arjun: పుష్ప పాత్ర కోసం అల్లు అర్జున్ కి అంతసేపు మేకప్ వేశారా.. వామ్మో!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17 విడుదల కాబోతోంది. విడుదలకు ఒక రోజు సమయం ఉండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లుఅర్జున్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ ఒక ఇంటర్వ్యూ లో తన పాత్ర గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు. పుష్ప సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా వేయని మేకప్ ఈ సినిమాలో వేశారని తెలిపారు.

పుష్ప రాజ్ పాత్రలో సందడి చేయడం కోసం ప్రతిరోజు రెండు గంటలపాటు మేకప్ కోసం సమయం కేటాయించే వాడిని సరైన పుష్ప రాజ్ గెటప్ రావాలంటే రెండు గంటల సమయం కేటాయించాల్సి వచ్చిందని తిరిగి ఆ మేకప్ అంత తొలగించుకోవడానికి అరగంట సమయం పట్టేదని ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలిపారు. ఇప్పటివరకు తన కెరీర్లో ఏ సినిమాకి కూడా ఇంత మేకప్ అవసరం రాలేదని ఐకాన్ స్టార్ పుష్ప సినిమాలో తన పాత్ర గురించి తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కూడా డీ గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.