Allu Arjun: ఆ నిర్మాతకు నో చెప్పిన బన్నీ.. ఎందుకో తెలుసా?

Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ 17 న విడుదలైన విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమా విడుదల అయి నెల రోజులు దాటినా కూడా ఈ సినిమా క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు దక్కింది.

ఇక అల్లు అర్జున్ ఈ సినిమాకు బాలీవుడ్ లో ఏకంగా నూరు కోట్ల వసూళ్లు సాధించడంతో అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు, నిర్మాత సంస్థలు పోటీ పడుతున్నాయి. సాధారణంగా సౌత్ సినిమాలకు సౌత్ హీరోలకు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వుంది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పుష్ప సినిమా చూసిన ఒక బాలీవుడ్ నిర్మాత అల్లు అర్జున్ కి 50 కోట్లు అడ్వాన్సు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడట. అంతే కాకుండా భారీ మొత్తంలో ఖర్చు చేసి అల్లు అర్జున్ తో అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సిద్ధం అని తెలిపారట.

అయితే అల్లు అర్జున్ ఆ బాలీవుడ్ నిర్మాతకు ప్రాజెక్టు చేయలేను అంటూ సున్నితంగా తిరస్కరించడం తో పాటు భారీ అడ్వాన్సులు కూడా తిరస్కరించినట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా పుష్పా సినిమా పార్ట్ 2 పై పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిందా వరకు మరొక సినిమా గురించి చర్చించడం కరెక్టు కాదనే ఉద్దేశంతో అల్లుఅర్జున్ ఉన్నాడట. ఇప్పటికీ టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఆ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత బాలీవుడ్ సినిమాలో గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.