Raviteja: బన్నీ, తారక్ మిస్ చేసుకున్నారు.. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏంటో తెలుసా?

Raviteja: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కొంతమంది హీరోలను దృష్టిలో పెట్టుకొని దర్శకులు కథ సిద్ధం చేస్తుంటారు అయితే కొన్ని కారణాల వల్ల ఆ హీరోలు సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా కొంతమంది రిజెక్ట్ చేసిన సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్న వారు ఉన్నారు అలాగే డిజాస్టర్ సినిమాల నుంచి బయటపడిన వారు ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరి ఇద్దరూ పాన్ ఇండియా హీరోలు రిజెక్ట్ చేసిన ఆ సూపర్ హిట్ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒకరు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఎన్నో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇకపోతే బోయపాటి భద్ర సినిమా కథను సిద్ధం చేసి ముందుగా ఈ సినిమా కథను అల్లు అర్జున్ కు వినిపించారట. అయితే అల్లు అర్జున్ మాత్రం కథ విని అద్భుతంగా ఉందని కాకపోతే తనకు ఇతర సినిమా షూటింగ్స్ కారణంగా బిజీ ఉన్న నేపథ్యంలోనే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో వదులుకున్నారని తెలుస్తోంది.

ఇలా అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడంతో ఈ కథతోనే బోయపాటి ఎన్టీఆర్ ను కలిసారట అయితే కథ చెబుతున్న సమయంలోనే ఇందులో వయోలెన్స్ ఎక్కువగా ఉందని తారక్ అన్నారట. అందుకే ఈసినిమా చేయలేను అని చెప్పారట. అలా ఎన్టీఆర్ కూడా భద్ర సినిమాను మిస్ అయ్యాడు. అటు అల్లు అర్జున్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరు ఈ కథను రిజెక్ట్ చేయడంతో బోయపాటి మాస్ మహారాజ రవితేజను సంప్రదించారని తెలుస్తోంది. ఇక రవితేజ ఈ సినిమా కథ వినగానే సినిమాకు కమిట్ అవ్వడం ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. ఈ సినిమాలో రవితేజ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించగా, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.