Ram – Lakshman: కొన్ని సార్లు అక్కడ ఫైట్ అవసరం లేకున్నా కొంతమంది అనవసరమైన ఫైట్‌ని క్రియేట్ చేసి పెడుతుంటారని, అప్పుడు చూసే ప్రేక్షకుడికే అనిపిస్తుంది.. అసలు ఇక్కడ ఫైట్ ఎందుకు పెట్టారు అనవసరం అని.. అంటూ తమ మనసులోని భావాలను నిర్మోహమాటంగా పంచుకున్నారు ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్. అలాంటి సందర్భం తమకు కూడా ఎదురైందని ఈ విధంగా చెప్పుకొచ్చారు.
ఇక విషయానికొస్తే అరవింద సమేత సినిమాకు తాము పనిచేస్తున్నపుడు ఇంట్రడక్షన్ ఫైట్ చేశాం. దాని ముందు కు మరో రెండు చేశాం. క్లైమాక్స్ కోసం తాము మరో ఫైట్ ట్రై చేస్తున్నాం.. కానీ తమకేమీ ఆ కిక్ రావట్లేదని అర్థం అయిందని, చేసిందే చేశాము అనిపిస్తుందని తాము అనుకున్నట్టు వారు తెలిపారు. ఎందుకంటే ఆ సినిమాలో హీరో ఎప్పుడూ గొడవలొద్దు అనే చెప్తారు. కాబట్టి అంత ఫైట్ అవసరం లేదేమో. అది పెడితే అక్కడ హీరో చెప్పే మాటలకూ, ఆ సీన్‌కు కుదరదేమో అని అనుకున్నట్టు రామ్, లక్ష్మణ్ అన్నారు. అదే సమయంలో డైరెక్టర్ గారికి కూడా అలానే అనిపించడం కెమెరామెన్‌కు చెప్పడం జరిగాయని వారు చెప్పారు. ఆ తర్వాత వెంటనే షూటింగ్ ఆపేశామని వారు వివరించారు. అప్పుడు వారు మీరేంటీ ఫైట్ మాస్టర్స్ కదా.. మీరే ఫైట్ కావాలి అనాలి గానీ, వద్దంటున్నారు అంటే.. దానికి తాము కథ ఏం చెప్తుంది అనేది కూడా చూసుకోవాలి కదా అని వారు చెప్పినట్టు రామ్, లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఇకపోతే నాపేరు సూర్య సినిమాలో ఇంట్రడక్షన్ సీన్‌లో హీరో, పోలీసులను కొట్టాలి. ఆ సినిమా డైరెక్టర్ వంశీ అని, అతను చెప్పిన కథకు, చెప్పే దానికి చాలా తేడా అనిపించిందని, అతను కథ వేరే చెప్పాడు. కానీ పోలీస్ స్టేషన్ సీన్‌కి తీసుకెళ్లాడని వారు అన్నారు. రెండు రోజులు కంపోజ్ చేశాము. కానీ తమకు ఏం చేస్తున్నామో తెలియలేదని, వారికేం అర్థం కాలేదని వారు చెప్పారు. ఆ రోజు హీరో కూడా తమను పొగిడారని, కానీ మరుసటి వచ్చి డైరెక్టర్, మిగతా వాళ్లు కలిసి తమ కంపోజర్ నచ్చలేదని చెప్పి ఆ సినిమా నుంచి తీసేశారని రామ్, లక్ష్మణ్ తెలిపారు.