భార్యతో కలిసి డేట్ నైట్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. ఫోటో వైరల్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పుష్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకుని పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి లండన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ తాజాగా తన భార్యతో కలిసి డేట్ నైట్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గత రాత్రి స్నేహారెడ్డి అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి డేట్ నైట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వైన్ తాగుతూ ఎంజాయ్ చేయగా స్నేహ రెడ్డి ఈ డేట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.ఇలా అల్లు అర్జున్ తనకు సమయం దొరికినప్పుడల్లా తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ లోనే లాంగ్ డ్రైవ్ వెళ్లడం లేదా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం చేస్తుంటారు.

స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు,వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఈమె కూడా హీరోయిన్ కన్నా ఎక్కువ సంఖ్యలో పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరి డేట్ నైట్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే త్వరలోనే అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా కానున్నారు.