టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అల్లు కుటుంబానికి చెందిన మూడు తరాల వారశులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మొదట అల్లు రామలింగయ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పరచుకున్నారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి ప్రముఖుల సినిమాలలో కీలకపాత్రలలో నటించాడు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ మొదట రెండు, మూడు సినిమాలలో నటుడిగా కనిపించాడు. అయితే అల్లు అరవింద్ కి నటన పట్ల ఆసక్తి లేకపోవడంతో నిర్మాణ రంగం వైపు వెళ్ళాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.
ఇక అల్లుఅరవింద్ ముగ్గురు కుమారులు అల్లు బాబి, అల్లు అర్జున్, అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అల్లు అరవింద్ మొదటి కుమారుడు అల్లు బాబి నిర్మాణరంగం వైపు వెళ్లి నిర్మాతగా మారి ఎన్నో మంచి సినిమాలను నిర్మించాడు. ఇక అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ వరుస హిట్ లతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ప్రస్తుతం పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. ఇక అల్లు అర్జున్ ఒక్క సినిమాకు దాదాపు 50 కోట్ల పైగా రెమ్యూనరేషన్ అందుకు అంటున్నాడు. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరిగింది.
ఇలా సినిమాల ద్వారా అధిక మొత్తంలో సంపాదిస్తున్న అల్లు అర్జున్ కమర్షియల్ యాడ్స్ లో నటించి వాటి ద్వారా కూడా భారీ ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇలా సినిమాల వల్ల యాడ్స్ వల్ల , రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అల్లు అర్జున్ వందల కోట్ల రూపాయలను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇలా ఇప్పటివరకు 500 కోట్ల రూపాయల విలువ చేస్తే ఆస్తులు కూడా పెట్టినట్లు సమాచారం. అల్లు అర్జున్ ఇంట్లో కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఒక ప్రైవేటు స్పేస్ జెట్ కూడా ఉంది. వీటన్నింటి విలువ దాదాపు 60 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.
ఇక అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అల్లు శిరీష్ నటించిన కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి. అయితే చాలాకాలంగా అల్లు శిరీష్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అల్లు అరవింద్ ముగ్గురు కుమారులలో అల్లు అర్జున్ మాత్రమే ఐకాన్ స్టార్ గా మంచి గుర్తింపు పొందాడు.