అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పుష్ప రాజ్

Allu Arjun fans thrilled with Pushpa Raj prelude

Allu Arjun fans thrilled with Pushpa Raj prelude

అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’ మీద అభిమానుల్లోనే కాదు సగటు సినీ ప్రేక్షకులందరిలోనూ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురములో’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ నుండి వస్తున్న సినిమా. ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ టేకప్ చేసిన ప్రాజెక్ట్. అందుకే ఇన్ని అంచనాలు. ఆ అంచనాలకు తగ్గట్టే నిర్మాతలు చేస్తున్న ప్రమోషన్స్ మరింత ఊరించేలా ఉన్నాయి. కథ విషయం ఎలా ఉన్నా కూడ సినిమా అల్లు అర్జున్ లుక్ మీద మాత్రం విపరీతమైన బజ్ నెలకొని ఉంది.

ప్రతి సినిమాలోనూ స్టైలిష్ లుక్ మైంటైన్ చేసే బన్నీ ఈ సినిమా కోసం కంప్లీట్ డీగ్లామర్ లుక్ లోకి మారాడు. అడవుల్లో తిరిగే స్మగ్లర్ పాత్ర కోసం రగ్డ్ లుక్ ట్రై చేస్తున్నాడు. ఆ లుక్ మూలానే సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఈరోజు చిత్ర బృందం రిలీజ్ చేసిన ప్రిల్యూడ్ వదిలారు. అందులో ఫిష్ కనిపించకుండా బన్నీని చూపించారు. ముఖానికి ముసుగు తొడిగి, చేతులు కట్టివేయబడి పరిగెడుతున్న బన్నీని చూస్తే సప్రైజ్ ఫీల్ వస్తోంది. దీనికే ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. దీనికే ఇలా ఉంటే ఏప్రిల్ 7న పూర్తిస్థాయిలో బన్నీని పరిచయం చేయనున్నారు. మరి దానికి అభిమానులు ఎంతలా ఊగిపోతారో చూడాలి.