అల్లు అర్జున్ ఫాన్స్ కి కోపం తెప్పించిన అను ఇమ్మానుయేల్

అందం, టాలెంట్ ఉన్నా కానీ ఎందుకో కొంతమంది హీరోయిన్లు అనుకున్నంత సక్సెస్ కాలేరు. దీనికి అనేకానేక కారణాలు ఉంటాయి. హీరోయిన్ కి కావలసిన అన్ని క్వాలిటీస్ ఉన్నా కానీ అను ఇమ్మానుయేల్ కి ఇప్పటివరకు సరైన గుర్తింపు రాలేదు.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తో ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ లాంటి సినిమాల్లో నటించినా కానీ అవి ప్లాప్ కావడం తో అను కెరీర్ ముందుకు సాగలేదు. కొంత గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ తో ‘ఊర్వశివో రాక్షసివో ‘ అనే సినిమాతో మన ముందుకు వస్తుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ని పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో  ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అను హర్ట్ అయింది ఫీల్ అయిపోయి అక్కడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.

రిపోర్టర్ అడుగుతూ ,,”మీరు నా పేరు సూర్య నా ఊరు ఇండియా అనే సినిమాలో అల్లు అర్జున్ తో నటించారు. ఊర్వశివో రాక్షసివో అనే సినిమాలో తమ్ముడు శిరీష్ తో నటించారు.. ఇద్దరిలో మీకు ఎవరు కన్వీనెంట్గా అనిపించింది”అంటూ ప్రశ్నించడు. దీంతో ఒక్కసారిగా అమ్మడు ఫైర్ అవుతూ..” ఇలాంటి ప్రశ్నలు తప్పిస్తే మీ దగ్గర వేరే ప్రశ్నలు ఉండవా” అంటూ ఫైర్ అయిపోయింది . అంతేకాదు అదే రిపోర్టర్ తిరిగి వేరే ప్రశ్న అడిగినా కూడా ఆమె సినిమా రిలీజ్ అవ్వకుండా నేను అలాంటి ఆన్సర్ ఇవ్వను అంటూ క్వశ్చన్ పాస్ చేసింది.

అను అన్న దాంతో అంత తప్పు లేకపోయినా  అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు. శిరిష్ తో కంపేర్ చేస్తే అల్లు అర్జున్ నే కచ్చితంగా స్టార్ పొజిషన్లో ఉన్నాడు నువ్వు కళ్ళు మూసుకుని అల్లు అర్జున్ పేరు చెప్పొచ్చు ..అల్లు శిరీష్ లో అంత టాలెంట్ లేదు ..అంత నటన లేదు .. అల్లు అర్జున్ పేరు చెప్పుంటే నీ లైఫ్ ఎక్కడికో వెళ్లిపోయిండేది. నీలాంటి హెడ్ వెయిట్ హీరోయిన్ మా ఇండస్ట్రీకి వద్దు ..బాయ్ కాట్ ఇమ్మానుయేల్ అనే హాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.