Allu Arjun: రామ్ చరణ్ కు ఊహించని షాక్ ఇచ్చిన బన్నీ… మెగా బంధానికి స్వస్తి పలికినట్టేనా?

Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అల్లు మెగా కుటుంబాలు ఒకటి అని చెప్పాలి. ఇలా ఈ రెండు కుటుంబాలు ఎంతో మంచి అనుబంధం కలిగి ఉన్నాయి అయితే గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య అనుకున్న స్థాయిలో రిలేషన్ లేదని తెలుస్తోంది.

ముఖ్యంగా అల్లు అర్జున్ ఎప్పుడైతే ఎన్నికల పర్యటనలో భాగంగా నంద్యాల వెళ్లారో అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న దూరం కాస్త పెరిగిందని చెప్పాలి. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య దూరం మాత్రం తగ్గడం లేదు. అయితే ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు కావడంతో చిరంజీవి నాగబాబు వెంటనే రియాక్ట్ అవుతూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు కానీ రామ్ చరణ్ మాత్రం ఎక్కడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు అదేవిధంగా ఏ ఇతర మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల ఎలాంటి స్పందన తెలియ చేయలేదు.

ఇక అల్లు అర్జున్ సైతం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా చిరంజీవి నాగబాబును కలిసి వారితో మాట్లాడిన సంగతి తెలిసిందే అయితే ఈ సంఘటన తర్వాత తిరిగి చిరంజీవి మెగా కుటుంబంతో కలిసి కనిపించిన దాఖలాలు లేవు అంతేకాకుండా రాంచరణ్ ఏకంగా అల్లు అర్జున్ ను ఇంస్టాగ్రామ్ లో కూడా అన్ ఫాలో చేశారు. ఇలా మెగా హీరోలందరూ ఒక్కొకరుగా అన్ ఫాలో చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ సైతం రామ్ చరణ్ కు ఊహించని షాక్ ఇచ్చారు. నేడు రామ్ చరణ్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు .ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు ఎలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఇలా బన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం తగ్గడం లేదని అల్లు అర్జున్ పూర్తిగా మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.