Deepika Padukone: బన్నీ, అట్లీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దీపిక… ఆకట్టుకుంటున్న వీడియో!

Deepika Padukone: అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమాని ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది . ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని ఎవరు అందుకుంటారనే విషయంపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. జాన్వి కపూర్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి .అనంతరం మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని దీపికా పదుకొనే అందుకున్నారని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే దీపికని పరిచయం చేస్తూ చిత్రబృందం ఒక ఆసక్తికరమైన వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.మూవీ యూనిట్ రిలీజ్ చేసిన వీడియోలో దీపికాతో కూడా VFX సీన్స్ షూట్ చేసుకున్నారు. ఈ వీడియోలో చూపించిన దానిబట్టి ఇదేదో పీరియాడిక్ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది. దీపికాని ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది.

Welcome on board Deepika Padukone | The Faces of #AA22xA6 | Allu Arjun | Sun Pictures | Atlee

ఈ వీడియోలో దీపికా పదుకొనే కత్తి పట్టి యుద్ధం చేస్తూ, గుర్రపు స్వారీ చేస్తున్నటువంటి సన్నివేశాలను కూడా చూడవచ్చు. ఇక ఈ వీడియో చూస్తుంటే మాత్రం దీపిక పాత్ర ఈ సినిమాలో అద్భుతంగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది. దీపిక ఇటీవల సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాకు కూడా ఎంపికయ్యారు. అయితే ఎనిమిది గంటలపాటు తాను పనిచేయలేనని ఈమె డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పించారు. ఈ విషయం గురించి ఇటీవల వార్తలు నిలిచారు. అయితే స్పిరిట్ లాంటి పాన్ ఇండియా సినిమా పోయిన మరో పాన్ ఇండియా సినిమాలో ఈమెకు అవకాశం రావటం విశేషం.