‘అల్లూరి’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. అల్లూరి సినిమాకి పని చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులందరికీ నా బెస్ట్ విశేష్. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్ కయ్యదు లోహర్ కి ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రదీప్ వర్మకి నా బెస్ట్ విశేష్. బెక్కెం వేణుగోపాల్ గారి ప్రేమ ఇష్క్ కాదల్ నుండి హుషారు వరకూ ప్రతి సినిమాని ఫాలో అవుతుంటాను. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీసి తెలుసు సినిమా స్థాయిని పెంచాలి. శ్రీవిష్ణు నాకు ఇష్టమైన వ్యక్తి. విష్ణు సినిమాలన్నీ ఫాలో అవుతుంటాను. ఆయన మొదటి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్. అందులో ముగ్గురు హీరోలు వుంటారు. అయితే తనకున్న పరిధిలోనే అద్భుతంగా నటించి అందరినీ ఆకర్షించారు. అప్పటినుండి శ్రీవిష్ణుపై ప్రత్యేకమైన ఇష్టం. ఆయన్ని పిలిచి మాట్లాడా. ఆయన చేసిన ప్రతి సినిమా ఫాలో అవుతుంటాను. విష్ణు గారికి మంచి అభిరుచి వుంది. ఆయన చేసే సినిమాల్లో కొత్తదనం వుంటుంది. సినిమా కోసం చాలా అంకిత భావంతో పని చేసే హీరో శ్రీవిష్ణు. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం, గౌరవం. ఆయన ప్రతి సినిమా విజయం సాధించి, ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న థియేటర్లోకి వస్తుంది. మీరందరూ చూసి దీవించాలని కోరుకుంటున్నాను. విష్ణు మంచి సినిమాలు ఇస్తూనే వుంటారు. ప్రస్తుతం నేను పుష్ప 2 పనుల్లో కాస్త బిజీగా వున్నాను. ఈ సమయంలో విష్ణు వచ్చి ఈ వేడుకకు రమ్మని కోరారు. ఆయన ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం ఇలా అడిగేసరికి మరో ఆలోచన లేకుండా ఈ ఈవెంట్ కి రావాలని ఫిక్స్ అయిపోయా. నా మనసుకు నచ్చే వ్యక్తి విష్ణు. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మరింత పైకి రావాలని కోరుకుంటున్నాను. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి కంటెంట్ వున్న చిత్రాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అల్లూరి సినిమా మంచి కంటెంట్ తో వస్తోంది. సెప్టెంబర్ 23న అందరూ థియేటర్ లో చూసి దీవించాలి” అని కోరారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అల్లూరి కథని ఐదేళ్ళుగా నమ్మి ఇక్కడి వరకూ తీసుకొచ్చాం. దీనికి ప్రధాన కారణం మా దర్శకుడు ప్రదీప్ వర్మ. నా కోసం ఐదేళ్ళు ఓపిక పట్టారు. ఇది చాలా వైవిధ్యమైన పోలీస్ స్టొరీ. ఇరవై ఏళ్ళ లైఫ్ టైం ని ఈ కథలో చాలా అద్భుతంగా చూపించబోతున్నాం. ఫిక్షనల్ క్యారెక్టర్. కానీ సంఘటనలు మాత్రం అన్నీ నిజంగా జరిగినవే. ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా అల్లూరి. పోలీస్ వ్యవస్థ మనకి గొప్ప సేవ చేసింది. కరోనా సమయంలో కూడా వారి సేవ చేశాం. ఆలాంటి వారికి ఏదైనా చేయాలని అనుకున్నాను. ఈ సినిమా చేశాను. మీ అందరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. నేను ఇండస్ట్రీ ఖాళీ చేతులతో వచ్చా. ఎటు వెళ్ళాలో తెలీదు. అలాంటి సమయంలో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో మా బెక్కం వేణుగోపాల్ గారు చిన్న పాత్ర ఇచ్చారు. ఈ సినిమా విడుదలైన నాలుగైదు రోజులకు అల్లు అర్జున్ గారి నుండి కాల్ వచ్చింది. మొదట నమ్మలేదు. ఫ్రండ్స్ ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నా. ఆయన్ని కలవడానికి వెళ్ళా. రేసుగుర్రుం షూటింగ్ లో వున్నారు.అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను. ”నీకు చాలా సినిమా అవకాశాలు వస్తాయి. కానీ తొందరపడి చేయొద్దు. మరో ఐదేళ్ళలో పరిస్థితి మారుతుంది. కంటెంట్ వున్న సినిమాలే ప్రేక్షకులు చూస్తారు. నువ్వు కంటెంట్ వున్న సినిమాలే చేయాలి. నీకు కథ నచ్చితే నా దగ్గరరికి తీసుకురా. నేను నిర్మించే ఏర్పాటు చేస్తాను. నీకు ఇండస్ట్రీలో ఎవరూ లేరని భావించకు. నేనున్నాను. నీకు ఎలాంటి అవసరం వున్న నన్ను అడుగు” అని మాటిచ్చారు. ఆయన మాటలు నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చాయి. బన్నీగారితో సన్ అఫ్ సత్యమూర్తి సినిమా చేశా. ఒకసారి శభరిమల వెళ్తే ఆ సినిమాతో నన్ను గుర్తుపట్టారు. కరోన తర్వాత సచు అనే ప్రదేశానికి వెళ్ళా. అక్కడ సరిగ్గా ఆక్సిజన్ కూడా వుండదు. అక్కడ కూడా సన్ అఫ్ సత్యమూర్తి సినిమాతోనే నన్ను గుర్తుపట్టారు. ఆక్సిజన్ లేని చోట కూడా అల్లు అర్జున్ ఆర్మీ వుంది. అందరూ ప్లాన్ చేసి పాన్ ఇండియా మూవీ చేస్తారు. బన్నీ గారు అవేమీ చేయాల్సిన అవసరం లేదు. ఫిలిం నగర్ లో పాట రిలీజ్ చేస్తే పాన్ వరల్డ్ అవ్వుద్ది. నాకు అల్లు అర్జున్ గారు ఎంత ఇష్టమో చెప్పాలంటే.. నా ప్రతి సినిమా, పాత్ర టైటిల్ లో ఎఎ అనే అక్షరాలూ ఉండేలా చూసుకుంటా. మిస్ అయిన ఒకే ఒక సినిమా అల్లూరి. అందుకే ఈ ఈవెంట్ కి ఆయన్ని రావాలని కోరాను. సెప్టెంబర్ 23న అల్లూరి థియేటర్ లోకి వస్తుంది. ఫస్ట్ హాఫ్ అల్లూరి సింగిల్ స్క్రీన్ .. తగ్గేదేలే. సెకండ్ హాఫ్ మల్టీఫ్లక్స్ లు తగ్గేదేలే. చివరి అరగంట చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులకు ఒక రెండు రోజుల పాటు సినిమా వెంటాడుతుంది. చాలా మంచి సినిమా చేశాం. అందరూ తప్పకుండా చూడాలి”అని కోరారు.
నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గారు ఈ ఈవెంట్ కి రావడం నా జీవితంలో మర్చిపోలేను. అల్లు అర్జున్ ఈవెంట్ కి వస్తున్నారంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. హుషారు సినిమా పాటకోసం ఒక్క మెసేజ్ పెట్టారు. దాంతో ఆ సాంగ్స్ మిలియన్ వ్యూస్ కి వెళ్ళిపోయింది. అల్లూరి టీంని సపోర్ట్ చేయడానికి ఇక్కడి వచ్చినందుకు కృతజ్ఞతలు. అల్లూరి సినిమా ఎక్కడ రాజీపడకుండా నిర్మించారు. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా అల్లూరి. సెప్టెంబర్ 23న ప్రేక్షకులు చూసి ఆనందిస్తారని కోరారు.

చిత్ర దర్శకుడు ప్రదీప్ వర్మ మాట్లాడుతూ.. మా సినిమాకి ప్రేక్షకులు వస్తే చాలు అనుకున్నాను. కానీ అల్లు అర్జున్ గారి ఆర్మీ వచ్చేసింది. అల్లు అర్జున్ గారు ఈ వేడుకకు వచ్చినందుకు కృతజ్ఞతలు. అల్లు అర్జున్ గారి రాకతో సినిమా స్థాయి పెరిగింది. జనాల్లోకి వెళ్ళింది. ‘పోలీస్ అంటే ఒక వ్యక్తి కాదు.. పోలీసు అంటే ఒక వ్యవస్థ’ ఈ ఒక్క డైలాగ్ ఆధారంగా పవర్ ఫుల్ కథని రెడీ చేశాం. కొన్ని సంఘటనలని కుదించి ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్ లా చేశాం. అల్లూరి చాలా కిక్ ఇచ్చే సినిమా. శ్రీవిష్ణులో ఇప్పటి వరకూ ఇరవై శాతమే చూశాం. నేను అదనంగా మరో ఇరవై శాతం చుపించా. ఈ సినిమా తర్వాత ఆయనకి వచ్చే కథలు ఇంకా బలంగా చుపిస్తాని భావిస్తున్నాను. ఇందులో నాలుగు వేరియేషన్స్ ఇవ్వడం కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు విష్ణు. ఈ సినిమా చూసిన తర్వాత మరో పదేళ్ళ వరకూ విష్ణునే పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తాడు. సెప్టెంబర్ 23న రిలీజ్. థియేటర్స్ లో తగ్గేదేలే” అన్నారు

కయ్యదు లోహార్ మాట్లాడుతూ.. అల్లూరి సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు. అల్లూరి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా వుంది. ఇందులో సంధ్య అనే చక్కని పాత్రలో కనిపిస్తాను. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. సెప్టెంబర్ 23న అందరూ థియేటర్ లో చూడాలి” అని కోరారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గారితో నాకు యాడ్ ఫిలిం చేసే అవకాశం దొరికింది. ఆయనతో మరోసారి పని చేయాలని కోరుకుంటున్నాను. బెక్కం వేణుగోపాల్ గారు చాలా మంది యువ దర్శకులు, నటీనటులకు అవకాశం ఇచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా ప్రోత్సాహం అందించారు. ఆయన సినిమా గురించే కష్టపడతారు. శ్రీవిష్ణు గారు చాలా అంకిత భావంతో పని చేసే హీరో. ప్రతి హీరో కెరీర్ లో పోలీస్ రోల్ ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. అల్లూరి సినిమా శ్రీవిష్ణు గారి కెరీర్ లో మైల్ స్టోన్ కావాలి. దర్శకుడు ప్రదీప్ వర్మకు గుడ్ లక్. సినిమా యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్ ” తెలిపారు.

తేజ మార్ని మాట్లాడుతూ.. శ్రీవిష్ణు గారికి ఒక కథ చెప్పడానికి వెళ్లాను. ఆయన నాకు రెండున్న గంటలు కూర్చో బెట్టి ఒక కథ చాలా వివరంగా చెప్పారు. అప్పుడే ప్రదీప్ ని పరిచయం చేశారు. గ్రేట్ టీం వర్క్ తో చేసిన సినిమా అల్లూరి . శ్రీవిష్ణు గారికి అల్లూరి బిగ్గెస్ట్ హిట్ కావాలి” అని కోరారు.
శ్రీ హర్ష మాట్లాడుతూ.. అల్లు అర్జున్, శ్రీవిష్ణు గారి అభిమానులకు కృతజ్ఞతలు. అల్లూరి సినిమా పెద్ద విజయం సాధించాలి. బెక్కం వేణుగోపాల్ గారు నాలాంటి దర్శకులని మరింతగా ప్రోత్సహించాలి’ అని కోరారు.

రాజ్ తోట మాట్లాడుతూ.. అల్లూరి చాలా నిజాయితీ గల సినిమా. చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. ట్రైలర్, టీజర్ ఎంత పవర్ ఫుల్ గా వున్నాయో అంతకంటే పవర్ ఫుల్ గా సినిమా వుంటుంది. అందరూ తప్పకుండా థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది” అన్నారు

రాంబాబు గోసాల మాట్లాడుతూ.. అల్లూరి సినిమాలో అన్ని పాటలు రాసినందుకు చాలా ఆనందంగా వుంది. మంచి సాహిత్యం కుదిరింది. హర్శవర్షన్ రామేశ్వర్ మంచి సంగీతం అందించారు. సినిమా చూస్తున్నపుడు గూస్ బంప్స్ వస్తాయి. ప్రదీప్ వర్మ చాలా అద్భుతమైన సినిమా తీశారు. సినిమా పూర్తయిన తర్వాత ప్రేక్షకులు చప్పట్లు కొట్టకపొతే నేను ఇండస్ట్రీని వదిలివెళ్ళిపోతా. శ్రీవిష్ణు గారి పెర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. బెక్కం వేణు గోపాల్ గారు ఏ సినిమా చేసినా హిట్టే. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. అల్లూరి సినిమా చరిత్ర సృష్టించబోతుందనే నమ్మకం వుంది. ఇందులో శ్రీవిష్ణు ఓరలో తీసిన కత్తిలా, ఐదడుగుల బుల్లెట్ లా వున్నాడు. అల్లూరి క్లైమాక్స్ అన్ బిలివబుల్. నాకు కన్నీళ్లు వచ్చాయి. చాలా అద్భుతంగా తీశాడు దర్శకుడు ప్రదీప్ వర్మ. ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది’ అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. కంటెంట్ నమ్ముకొని చిత్రాలు తీసే నిర్మాత బెక్కం వేణు గోపాల్. ఇప్పుడు గొప్ప కంటెంట్ తో అల్లూరి సినిమా వస్తుంది. అల్లూరి ప్రతి తెలుగు వాడి నోటి మాట. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి. ఇకపై అల్లూరి వేణుగోపాల్ అవ్వాలి” అని కోరుకున్నారు.
చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్మాతలకే వెన్నె తెచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్. అల్లూరి సినిమా ఆయన కెరీర్ లో అగ్ర నిర్మాతగా ఎదగడానికి తొలి మెట్టు అని భావిస్తున్నాం. అయన మరిన్ని గొప్ప సినిమాలు చేయాలి” అన్నారు

రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ.. సక్సెస్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బెక్కం వేణుగోపాల్. అల్లూరి వంద రోజుల సినిమా. బెక్కం వేణు గోపాల్ అండ్ అల్లూరి టీంకి ఆల్ ది బెస్ట్” తెలిపారు.