Allu Arjun: జోమాటో బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. మనసు కోరితే తగ్గేదే లే..!

Allu Arjun: ప్రస్తుత కాలంలో నటి, నటులు సినిమాలు మాత్రమే చేసి డబ్బులు సంపాదించడం కాకుండా వ్యాపారాలు, యాడ్స్ లో నటించటం,వివిధ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు . టాలీవుడ్ లో రామ్ చరణ్, మహేష్ బాబు వంటి ప్రముఖులు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా వీరి లాగే కమర్షియల్‌ యాడ్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుత పుష్ప సినిమా హిట్ తో అల్లు అర్జున్ మంచి హురుగా ఉన్నారు.

అల్లు అర్జున్ ఇప్పటికే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరొక ఫేమస్ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ హైదరాబద్లోని ప్రముఖ స్టార్ హోటల్ లో చేశారు. ఈ యాడ్ లో నటుడు సుబ్బరాజు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ యాడ్ లో బన్నీ,సుబ్బరాజు మద్య గొడవ జరుగుతుండగా..సుబ్బరాజును బన్నీ ఒక్క దెబ్బతో గాలిలో ఎగిరేలా చేస్తాడు. ఆ సీన్ స్లో మోషన్ లో ఉండగా సుబ్బరాజు బన్నీని నన్ను తొందరగా కిందకి దించు.. నేను కిందికి వచ్చేలోపు రెస్టారెంట్ మూసేస్తారు .. నాకు గోంగూర మటన్ తినాలని ఉంది అని అడగగా.. ఏం కావాలన్నా.. ఎప్పుడు కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా.. మనసు కోరితే తగ్గేదేలే’ అంటూ బన్నీ చెప్పే పుష్ప డైలాగ్ తో ఈ యాడ్ అయిపోతుంది.