ఆ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్

పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ శ్రీ విష్ణు సినిమా ‘అల్లూరి’ కి గెస్ట్ గా వెళ్ళాడు. దర్శకుడు ప్రదీప్ వర్మ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ అల్లూరి. శ్రీవిష్ణు కెరీర్ లో మొదటిసారి సీరియస్ పోలీస్ రోల్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతో డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో మీద ప్రశంశలు కురిపించాడు అల్లు అర్జున్. ఈ ఈవెంట్ కి హాజరుకావడానికి అసలు కారణం హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు నాకు ఇష్టమైన హీరో. తన మొదటి చిత్రం ప్రేమ ఇష్క్ కాదల్ తో పాటు మెంటల్ మదిలో, అప్పట్లో ఒకడుండేవాడు, రాజ రాజ చోర చిత్రాలు చూశాను. విభిన్నమైన కథలు ఎంచుకుంటాడు. చాలా కష్టపడతాడు. శ్రీవిష్ణుకు నా సప్పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నేను షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా ఈ ఈవెంట్ కి వచ్చేవాడినని అల్లు అర్జున్ అన్నాడు.

అయితే అల్లు అర్జున్ ఒక విషయం లో ఇబ్బంది పడ్డాడు.  ‘అల్లూరి’ మూవీ  హీరోయిన్ పేరును పలకడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కొంచెం కష్టంగా ఉన్న ఆమె పేరును గుర్తు పెట్టుకోవడం శ్రీవిష్ణుకు కష్టం అనిపించింది. ఈ క్రమంలో ఆయన ఆమెకు సారీ చెప్పాడు. హీరోయిన్ పేరు నాకు ఇప్పటికే మూడు సార్లు చెప్పారు. అయినా నాకు గుర్తు ఉండడం లేదనగానే… నిర్మాత బెక్కం వేణు గోపాల్ చెవిలో చెప్పారు. కయాడు లోహర్ నన్ను క్షమించాలి ఆమె పేరు మర్చిపోయినందుకని అల్లు అర్జున్ అన్నారు. కన్నడ ఇండస్ట్రీ కి చెందిన కయాడు లోహర్ అల్లూరి మూవీతో టాలీవుడ్ లో డెబ్యూ చేస్తుంది.