Kranthi Balivaada: రేసుగుర్రం సినిమాలో చేసిన క్యారెక్టర్‌కి తనకు మంచి గుర్తింపు వచ్చిందని ప్రముఖ ఆర్టిస్ట్ క్రాంతి బలివాడ అన్నారు. ఆ చిత్రానికి సంబంధించి షూట్ జరుగుతున్నపుడు సెట్లో అల్లు అర్జున్ అందరితోనూ హ్యాపీగా మాట్లాడుతారని ఆమె చెప్పుకొచ్చారు. మనం ఒకసారి పరిచయమైన తర్వాత మళ్లీ కలిసినపుడు ఆయనో పెద్ద స్టార్ కదా మాట్లాడితే ఏమనుకుంటారో అని దూరంగా కూర్చునేవాళ్లం. కానీ ఆయన మాత్రం అందరి దగ్గరికీ వెళ్లి నవ్వుతూ పలకరించేవారని ఆమె చెప్పారు. అలా చాలా కబుర్లు చెప్పుకుంటూ తమతో చాలా ఫ్రీగా గడిపేవారని ఆమె అన్నారు.
మొదట్లో తాను ఆయనతో మాట్లాడలేదని, ఆయనే స్వయంగా వచ్చి ఐ యామ్ అల్లు అర్జున్ అని తనకు తానే పరిచయం చేసుకొని మాట్లాడారని ఆమె అన్నారు. హీరోయిన్ శృతి హాసన్ రాగానే ఆమెను కూడా పిలిచి కూర్చొబెట్టి పరిచయం చేయించారని ఆమె తెలిపారు. వెరీ లైవ్‌లీ అండ్ హ్యాపీ పర్సన్ అల్లు అర్జున్ అని క్రాంతి వివరించారు.
ఇకపోతే మాస్ మహారాజా రవితేజ కూడా తాను కలిసి పనిచేశానని ఆమె చెప్పారు. అల్లు అర్జున్ అయితే మనం మాట్లాడకపోయినా కలుపుకొనిపోయి మాట్లాడతారన్న ఆమె, రవితేజ గారు మాత్రం కొంచెం తన పని తాను చేసుకొనిపోయే టైప్ అని ఆమె అన్నారు. మాట్లాడతారు కానీ, అంత క్లోజ్‌గా మాట్లాడరని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సీన్ వరకు ఎంత వరకు అంతే మాట్లాడతారని, అంతే గానీ మిగతా టైంలో తన పని తాను చూసుకొని వెళ్లిపోతారని ఆమె అన్నారు. మామూలుగా అందరూ చెప్పుకునేదేంటంటే రవితేజ గారు తనకేది ఇష్టమైతే అదే చేస్తారని. కాబట్టి ఆయన దగ్గర అందరూ అలాగే ఉంటారని, అంతగా జోవియల్ కలిసిపోయినట్టుగా ఉండరని ఆమె స్పష్టం చేశారు.