Allu Arjun: బన్నీ స్టార్ డమ్ టాలీవుడ్ హీరో జీర్ణించుకోలేకపోతున్నారా…. అందుకు ఇదే నిదర్శనమా?

Allu Arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పుష్ప సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న బన్నీ ఇటీవల పుష్ప 2 సినిమా ద్వారా సరికొత్త రికార్డులను సృష్టించారు. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో అల్లు అర్జున్ క్రేస్ భారీగా పెరిగిపోయింది అని చెప్పాలి.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ సక్సెస్ టాలీవుడ్ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది అందుకు ఇదే నిదర్శనం అంటూ అభిమానులు భావిస్తున్నారు. సాధారణంగా ఒక హీరో పుట్టినరోజు సందర్భంగా అందరూ హీరోలు వారికి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు కానీ ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు జరగడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్క హీరో కూడా అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు.

కేవలం ఎన్టీఆర్ మాత్రమే అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండటంతో అల్లు అర్జున్ సక్సెస్ ను ఏ హీరో కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా సంధ్య థియేటర్ ఘటన కూడా అందుకు కారణమని తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఎంతో మంది హీరోలు స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తనని పరామర్శించారు ఈ విషయంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో హీరోలు కాస్త వెనకడుగు వేశారు.

ఇక పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో కూడా కనీసం పోస్టులు చేయకపోవడంతో బన్నీని ఇండస్ట్రీ మొత్తం ఒంటరి వాడిని చేశారా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే తన పుట్టినరోజు సందర్భంగా అట్లీతో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు దాదాపు 1000 కోట్లతో నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అవ్వబోతున్నారు.