అమీర్ ఖాన్ సినిమాను భారీ దొరకు కొనుగోలు చేసిన అల్లు అరవింద్.. సినిమాపై పెరిగిన అంచనాలు?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర చిన్నది అయినప్పటికీ ఈయన పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ ఈ సినిమాలో స్నేహితులుగా సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కైవసం చేసుకున్నారు.

ఇక ఈ విషయాన్ని అల్లు అరవింద్ ప్రకటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ టైలర్స్ విడుదల అయినప్పటికీ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు పెరగలేదు.అయితే ఈ సినిమా తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారని తెలియడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా అల్లు అరవింద్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఈయన ఒక సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా విషయంలో ఈయన జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది.

గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ విడుదల చేసే లేదా నిర్మించే చిత్రాలు పక్కా హిట్ అవుతాయని నమ్మకం ప్రేక్షకులలో ఉంది. అందుకే ఈ సినిమాని అల్లు అరవింద్ భారీ ధరలకు కొనుగోలు చేశారని విషయం తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడటమే కాకుండా ఈ సినిమాని అల్లు అరవింద్ కొన్నారు అంటే ఈ సినిమాలో ఏదో మ్యాటర్ ఉంది అంటూ పెద్ద ఎత్తున అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే అమీర్ ఖాన్ నటించిన గజిని సినిమాని కూడా అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సినిమా అల్లు అరవింద్ కు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. అందుకే మరోసారి అమీర్ ఖాన్ సినిమాని అల్లు అరవింద్ విడుదల చేయబోతున్నారని మరికొందరు భావిస్తున్నారు.