Tollywood: తారాస్థాయికి చేరిన మెగా – అల్లు వివాదం.. మెగా బంధానికి స్వస్తి చెప్పినట్టేనా?

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలలో మెగా అల్లు కుటుంబాలు ఒకటి. ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాలు ఎప్పుడు వేరుగా లేవు. ఈ రెండు కుటుంబాల మధ్య మంచి బంధుత్వం ఉన్న నేపథ్యంలో ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ చిన్న వేడుక జరిగిన ఇరువురి కుటుంబ సభ్యులు కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే వారు. అయితే ఇటీవల కాలంలో లెక్కలు మారాయని తెలుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ పిఠాపురం కాకుండా హిందూపురం ఎన్నికల సమయంలో వెళ్లారో అప్పటినుంచి మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇక ఈ రెండు కుటుంబాల అభిమానుల మధ్య కూడా అదే స్థాయిలో వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక మెగా అల్లు కుటుంబం మధ్య దూరం భారీగా పెరిగిపోయిందని పైకి మాట్లాడుతూ కనిపించిన ఈ రెండు కుటుంబాల మధ్య దూరం భారీగా ఉందని తెలుస్తుంది. తాజాగా మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత హీరోగా వెండి తెరపై సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఈనెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ మరొక సినిమాని సిద్ధం చేశారు.హరిహర వీరమల్లు విడుదల టైం కు తగ్గేదే లే అంటూ పోటీగా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మహావతార్‌ నరసింహ సినిమా విడుదల చేస్తున్నారు. కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించిన మహావతార్‌ నరసింహ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తుంది.

ఇలా పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాని ఈ నెల 25వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే అల్లు అరవింద్ కూడా మహా అవతార్ నరసింహ సినిమాను విడుదల చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి మెగా వర్సెస్ అల్లు అనే విధంగా అభిమానుల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది.