Allu Aravind: గేమ్ ఛేంజర్ ఫ్లాప్…. సెటైర్లు పేల్చిన అల్లు అరవింద్….. ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్?

Allu Aravind: అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల తండేల్ జాతర అంటూ ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ దిల్ రాజు ఇద్దరు కూడా ఒకేసారి వేదిక పైకి వెళ్లారు. అయితే వేదిక పైకి వెళ్లినటువంటి అల్లు అరవింద్ దిల్ రాజును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరికెక్కిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే ఇందులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దిల్ రాజుకు మంచి లాభాలను తీసుకువచ్చినప్పటికీ రామ్ చరణ్ సినిమా మాత్రం పూర్తి స్థాయిలో నష్టాలను తీసుకువచ్చింది.

దిల్ రాజు సినీ కెరియర్లో ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా ఇప్పటివరకు చేయలేదు అలాగే ఇంత పెద్ద మొత్తంలో నష్టాలను కూడా ఎప్పుడు ఎదుర్కోలేదని చెప్పాలి. ఇలా ఒక సినిమా సక్సెస్ అయ్యి మరొక సినిమా ఫ్లాప్ కావడంతో అల్లు అరవింద్ వేదికపై దిల్ రాజు సినిమాల గురించి మాట్లాడుతూ..ఈ మధ్యనే సంక్రాంతికి దిల్ రాజు ఒక చరిత్ర సృష్టించారు. ఒక సినిమానేమో ఇలా తీసుకువెళ్లి అంటూ నేల వైపు చూపించారు. మరో సినిమాని అలా తీసుకువెళ్లారు అంటూ ఆకాశం వైపు చూపించారు.

నేలవైపు చూపించిన సినిమా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాని ఉద్దేశించే ఈయన మాట్లాడారు. ఇలా చరణ్ సినిమా గురించి అల్లు అరవింద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మెగా ఫాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ రెండు కుటుంబాల మధ్య గత కొద్ది రోజులుగా వివాదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలోనే చరణ్ సినిమా గురించి అల్లు అరవింద్ ఇలా మాట్లాడటంతో మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ ఉద్దేశం పూర్వకంగానే చరణ్ సినిమా గురించి అల్లు అరవింద్ ఇలా అవమానకరంగా మాట్లాడారు అంటూ మండిపడుతున్నారు.