Allu Aravind: అల్లు అరవింద్ నిర్మాణంలో నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అల్లు అరవింద్ దిల్ రాజును ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు అయితే వేదికపై వీరిద్దరూ మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో దిల్ రాజు సినిమాల గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
దిల్ రాజు గారు ఒకే వారంలోనే రెండు సినిమాల ద్వారా వచ్చారు ఒక సినిమా నేలకు వెళ్ళగా మరొక సినిమా ఆకాశం వైపు వెళ్లిందని మాట్లాడారు అయితే కొంతమంది మెగా అభిమానులు మాత్రం ఈయన కచ్చితంగా రాంచరణ్ సినిమా ఫ్లాప్ గురించి ఇలా మాట్లాడారు అంటూ అల్లు అరవింద్ పై విమర్శలు కురిపిస్తూ ట్రోల్ చేశారు. తాజాగా ఈ వివాదం గురించి అల్లు అరవింద్ మాట్లాడారు.
తండేల్ సినిమా పైరసీ అరికట్టడం గురించి చిత్ర బృందం ప్రెస్మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ కు మీడియా వారి నుంచి ఇదే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ సమాధానం చెబుతూ ఆ రోజు నేను దిల్ రాజు గారు ఒక వారంలో పడిన కష్టాల గురించి మాట్లాడుతూనే కామెంట్ చేశాను. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని యాదృచ్ఛికంగా జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఇక నేను మాట్లాడిన మాటలు వల్ల కొంతమంది మెగా అభిమానులు హర్ట్ అయ్యారని తనపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.
ఇక నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనలేదని తెలిపారు. ఇక చరణ్ నాకు అల్లుడే కానీ కొడుకుతో సమానమని తెలిపారు. వాడు నాకున్న ఏకైక మేనల్లుడు నేను తనకు ఏకైక మేనమామను తనని ఉద్దేశించి నేనెందుకు అలా మాట్లాడతాను. ఇక ఇంతటితో ఈ విషయాన్ని ఆపేయండి అంటూ అల్లు అరవింద్ ఈ వివాదానికి చెక్ పెట్టారు. ఇక ఇదే విషయంపై మీడియా వారు మరికొన్ని ప్రశ్నలు వేయగా ఇది ఇంతటితో ఆపేస్తేనే బాగుంటుంది లేకపోతే మరింత దూరం వెళుతుందని ఇది నేను ఒక ఎమోషనల్ గా మీకు తెలియచేస్తున్నాను అంటూ అల్లు అరవింద్ మాట్లాడారు.