Vastu Tips: మీరు ప్రయాణిస్తున్న వాహనంలో ఈ వస్తువులు పెడితే చాలు.. ఎలాంటి ప్రమాదాలు జరగవు!

Vastu Tips: సాధారణంగా మనం ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు ఆ వాహనానికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని సరైన సమయంలో మంచి ముహూర్తం చూసి వాహనాన్ని కొనుగోలు చేస్తాము. ఈ క్రమంలోనే వాహనం ఇంటికి తీసుకు వచ్చే ముందు వాహనానికి దిష్టి తీసి గుడిలో పూజ చేయించుకుని తీసుకు వస్తాము. ఇలా మనం కొనుగోలు చేసిన వాహనాలు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే మన వాహనంలో పాజిటివ్ వాతావరణం కలిగి వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల వస్తువులను వాహనంలో ఉంచాలి. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే…

మనం వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు వాహనం సీటు కిందా ఒక పేపర్లో రాళ్ళ ఉప్పు, కొద్దిగా వంటసోడా కలిపి ఉంచాలి. ఇవి మన వాహనంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా మనకు ఏకాగ్రతను పెంచుతాయి దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించవు. అయితే తరచూ ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి. అలాగే సాధారణ రాయి లేదా ఒక స్పటికం వాహనంలో ఉంచాలి. ఇది ఏ విధమైనటువంటి చెడు ప్రభావాన్ని ఆవహించకుండా కాపాడుతుంది. దీంతో ఎలాంటి ప్రమాదాలు సంభవించవు.

అలాగే చాలామంది వాహనంలో వారి డాష్ బోర్డు పై వారి ఇష్ట దైవానికి సంబంధించిన విగ్రహాలను పెట్టుకుంటారు. అయితే వినాయకుడి ప్రతిమను ఉంచడం ఎంతో శుభం. వినాయకుడు ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తాడు కనుక వినాయకుడి విగ్రహం పెట్టుకోవడం ఎంతో మంచిది.అలాగే మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు తప్పనిసరిగా నీటితో నింపిన బాటిల్ ఉండాలి. ఈ బాటిల్ మన దృష్టిని ఏకాగ్రతను పెంచడానికి దోహదపడతాయి. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.