Kranthi Balivaada: ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అందరిని మెప్పించిన క్రాంతి బలివాడ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని మహేష్ బాబుతో తాను నటించిన ఒక సినిమా గురించి తెలియజేశారు. మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా లో బ్రహ్మాజీ కాంబినేషన్ లో నటించాలని చెప్పారు. నిజం చెప్పాలంటే మంచి క్యారక్టర్ చేస్తున్నానని అనుకొని వెళ్లానని, కానీ తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే.. ఒక సాంగ్ ఉంటుంది. అది ఆ సినిమా సీక్వెన్స్ లో చేయాల్సి ఉంటుంది అని. ఆ సినిమాలో తాను బ్రహ్మాజీ గారికి కాంబినేషన్ గా చేశానని నటి క్రాంతి బలివాడ తెలిపారు. అందులో ఆయన మహేష్ బాబుకి పీఏగా చేశారని, ఆయనకి వైఫ్ గా చేయాలని తనకు చెప్పినట్టు ఆమె చెప్పారు.
ఆ తర్వాత మరుసటి రోజు షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది అన్నారు. అదెలా అంటే బ్రహ్మాజీని టీజ్ చేస్తూ ఉంటుందని ఆమె అన్నారు. అందులో కూడా ఒక డ్రామా ఉంటుందని ఒక స్టోరీ కూడా చెప్పారని క్రాంతి చెప్పారు. షూటింగ్ చేసాము… అంతా షూట్ చేశారు. అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే ఆ సాంగ్ లో తాను ఎక్కడా కనిపించలేదని ఆమె వాపోయారు.
దాని గురించి తాను మళ్ళీ ఎవరి దగ్గరా మాట్లాడలేదని, సైలెంట్ ఉన్నానని క్రాంతి బలివాడ చెప్పారు. చేశానని కూడా తాను ఎవరికీ చెప్పుకోలేని, పేమెంట్ తీసుకున్నా కదా అనుకుని అక్కడి నుండి వచ్చేసాను అని ఆమె వివరించారు.అలా మహేష్ బాబు సినిమాలు తను నటించిన క్యారెక్టర్ మొత్తం ఎడిటింగ్లో తీసేసారని ఆమె ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.