Rangastalam Movie: సుకుమార్ సినిమాలో తాను చేసిన క్యారెక్టర్ మొత్తానికే తీసివేశారని, తాను దానికి డబ్బింగ్ కూడా చెప్పానని సినీ నటుడు పృద్వీ రాజ్ తెలిపారు. అమెరికా నుంచి ఎవరో వద్దన్నారని ఆయన తెలిపారు. రంపచోడవరం, పోలవరం ఏరియాలో, సెట్లో 3 రోజులు చేసిన ఆ గట్టునుంటావా సాంగ్‌ని ఓ వారం రోజులు షూట్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అమెరికాలో ఉండే ఒకాయన ఎవరో చెప్పారని, తన క్యారెక్టర్ తీసేసినట్టు ఆయన చెప్పారు. అది నిజంగా చాలా కామెడీగా అనిపించిందని ఆయన అన్నారు. ఆయన్ని పెడితే మళ్లీ ఓ రావుగోపాల్ రావులాగా అయిపోతాడు వద్దు అని ఆయనెవరో చెప్పారట అని పృద్వీ తెలిపారు.
మనం డైరెక్టర్‌ని ప్రశ్నించలేమన్న ఆయన, త్వరలోనే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లందర్నీ కలుస్తానని ఆయన చెప్పారు. కలిసి మీకు నేను ప్లస్సా, మైనస్సా అని వాళ్లను అడుగుతానని, ఒకవేళ వాళ్లు ప్లస్ అని చెప్తే మనం ఫ్రెండ్లీగా ఉందామని, మైనస్ అనుకుంటే తనకు ఓ అవకాశం ఇవ్వమని అడుగుతానని ఆయన స్పష్టం చేశారు.
కొంత మంది అనుకున్నట్టు తాను పాలిటిక్స్‌లోకి రాకుండా ఉన్నట్లయితే ఆ లీడ్స్ క్యారెక్టర్స్ అలానే కంటిన్యూ అయి ఉండేవని.. కానీ అలా ఏం లేదని ఆయన చెప్పారు. అందరికీ ఫ్యాషన్ అనేది ఉంటుందని, కానీ ఒకడి కింద బతకకూడదని ఆయన అన్నారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకునే టైప్ తాను అని ఆయన వివరించారు.
అయితే ఆ సినిమాలో తన క్యారెక్టర్ తీసివేశాక, మళ్లీ రామ్‌చరణ్ నటించిన వినయ విధేయ రామకు వెళ్లామని, అక్కడ ఆయన్ని కలిశానని పృద్వీ చెప్పారు. కానీ గడిచిపోయిన దాని గురించి తానేం మాట్లాడలేదని, బ్రహ్మండంగా యాక్ట్ చేశారు.. సూపర్ హిట్, ఇరగదీశారని మాత్రమే తాను ఆయనతో అన్నట్టు పృద్వీ స్పష్టం చేశారు.
