గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కన ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం మునిగిపోయింది. వందల కాలనీలు నీట మునిగిపోయాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు అలాగే ఉంది.
ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. వరద బాధితులను ఆదుకుంటోంది. వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
దసరా పండుగ వరకు నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. దసరా తర్వాత పరీక్షలను నిర్వహించుకోవాలని అన్ని యూనివర్సిటీలకు సూచించింది.